Big Stories

Priyanka Reacts after speaker Chides Congress: పార్లమెంటులో స్లోగన్స్‌పై స్పందించిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Reacts after speaker Chides Congress: లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో హైదరాబాద్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, జై పాలస్తీనా అంటూ ఓవైసీ నినాదం చేయడాన్ని అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. మరికొంతమంది అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేరళలోని తిరువనంతపురం నుంచి నాలుగోసారి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన జై హింద్, జై సంవిధాన్ అటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడున్న ఎంపీలు కూడా జై సంవిధాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. దీనిపై అభ్యంతరం తెలిపారు.

- Advertisement -

అనంతరం కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర హుడా మాట్లాడుతూ.. దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయకూడదంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో వెంటనే స్పీకర్ స్పందించారు. ఎలాంటి వాటికి అభ్యంతరం చెప్పాలో.. చెప్పకూడదో అనేదానిపై తనకు సలహాలు ఇవ్వొద్దంటూ హుడాపై ధ్వజమెత్తారు.

- Advertisement -

మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. పార్లమెంటులో జై సంవిధాన్ అని కూడా అనకూడదా? అంటూ ప్రశ్నించారు.

Also Read: పార్లమెంటులో రాహుల్ గాంధీ మైక్‌ను మ్యూట్ చేస్తున్నారు: కాంగ్రెస్

పార్లమెంటులో అధికార పార్టీ నేతలు అన్‌పార్లమెంటరీ, రాజ్యాంగ విరుద్ధ నినాదాలు చేసినప్పుడు వీళ్లెవ్వరూ అడ్డుచెప్పరు. కానీ, విపక్ష ఎంపీలు జై సంవిధాన్ అని నినాదాలు చేస్తే మాత్రం అడ్డుచెబుతారేంటి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వచ్చిన రాజ్యాంగ వ్యతిరేక సెంటిమెంట్ ఇప్పుడు కొత్త రూపంలోకి వచ్చిందన్నారు. ఇది మన రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చూస్తోందంటూ ఆమె మండిపడ్డారు. దేని ఆధారంగా పార్లమెంటు పనిచేస్తుందో.. దేనిపై ప్రతి సభ్యుడు ప్రమాణస్వీకారం చేస్తారో.. ప్రతి ఒక్కరి జీవితానికి ఏదైతే రక్షణ కల్పిస్తుందో అలాంటి రాజ్యాంగాన్ని, విపక్షాల గొంతును అణిచివేసేందుకు వ్యతిరేకిస్తారా? అంటూ పరోక్షంగా కేంద్రాన్ని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News