Big Stories

Bridge Collapses in Bihar: వారంలో మూడో బ్రిడ్జ్.. వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్‌లో మరో వంతెన..

Bridge Collapses in Bihar: బీహార్‌లో వంతెనలు వరుసగా కుప్పకూలుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. మోతీహరిలోని ఘోరసహన్ బ్లాక్‌లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

అమ్వా గ్రామాన్ని బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడానికి రాష్ట్ర గ్రామీణ పనుల విభాగం (RWD) కాలువపై 16 మీటర్ల పొడవైన వంతెనను నిర్మిస్తోంది. కాగా ఈ వంతెనను 1.5 కోట్లతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

“ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇది తీవ్రమైన విషయం. శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని RWD అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు.

Also Read: Arvind Kejriwal bail petition: లిక్కర్ కేసు.. సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ, జూన్‌ 26న సుప్రీంకోర్టులో

జిల్లా పరిపాలన సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక పైఅధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకుంటున్నామని జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ జోర్వాల్ తెలిపారు.

వంతెనలోని పిల్లర్ల నిర్మాణంపై స్థానికులలోని ఒక వర్గం మొదట అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదికలు ఉన్నాయని ఆయన తెలిపారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అటు శనివారం సివాన్ జిల్లాలో ఓ చిన్న వంతెన కూలిపోయింది. ఇది దారౌండా, మహారాజ్‌గంజ్ బ్లాక్‌ల గ్రామాలను కలుపుతూ కాలువపై నిర్మించారు.

Also Read: ప్రారంభానికి ముందే కుప్ప కూలిన బ్రిడ్జ్.. కోట్ల రూపాయలు వృథా..

అంతకు ముందు మంగళవారం అరారియా జిల్లాలో 180 మీటర్ల పొడవున కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయింది.

ఇలా వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటన వలన ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ పనుల నాణ్యతలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News