Big Stories

Annamalai-Tamilisai Meeting: అమిత్ షా వార్నింగ్.. ప్రాధాన్యత సంతరించుకున్న అన్నామలై-తమిళిసై భేటీ..

Annamalai-Tamilisai Meeting: తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై శుక్రవారం చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. ఇటీవలి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్ అన్నామలైపై విమర్శలు చేశారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. దీంతో అన్నామలై తమిళిసైను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైను కలిసిన తర్వాత అన్నామలై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఆమె రాజకీయ అనుభవం, వారి సలహాలు పారటీ ఎదుగుదలకు స్పూర్తినిస్తాయని సోషల్ మీడిలో రాసుకొచ్చారు.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ పేర్కొన్నారు. బీజేపీ-అన్నాడీఎంకే విడిపోవడానికి అన్నామలై కారణమని ఆరోపించిన ఎఐఎడీఎంకే నాయకుడికి తమిళిసై బహిరంగంగా మద్దతు తెలిపారు. అలాగే తమిళిసై సౌందరరాజన్ కూడా బీజేపీలో నేరపూరిత అంశాలున్నాయని ఎవరి పేరును ప్రస్తావించకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబరు 2023లో, అన్నాడీఎంకే బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. దీనికి కారణంగా అన్నామలై అన్నాడీఎంకే మాజీ నాయకులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయటమా కారణంగా పలువురు ఎత్తిచూపారు.

Also Read: ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న యోగి.. ‘గాలి బుడగ’ పై చర్చించే అవకాశం

ఇదిలా ఉంటే ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేదికపై సౌందరరాజన్‌ను తిట్టినట్లు కనిపించిన వీడియే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో అమిత్ షా.. తమిళిసైను హెచ్చరించినట్లు కనిపించింది. వీటన్నిటి నడుమ అన్నామలై-తమిళిసై సౌందరరాజన్ భేటీ తమిళ నాట, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News