Big Stories

Navneet Kaur attacks Asaduddin Over Jai Palestine remarks: రాష్ట్రపతికి నవనీత్ కౌర్ లేఖ.. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ..

BJP Leader Navneet Rana Kaur attacks Asaduddin: పార్లమెంటులో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీలు రకరకాలుగా స్లోగన్లు ఇచ్చారు. ఇండియా కూటమి ఎంపీలు ఒకలా.. ఎన్డీయే కూటమి ఎంపీలు మరోలా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ మాత్రం ఇంకోలా నినాదం చేశారు. ప్రమాణస్వీకారం తరువాత జై పాలస్తీనా అంటూ స్లోగన్ ఇచ్చారు. దీంతో సభలో దుమారం రేగింది. అసదుద్దీన్ నినాదాన్ని రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎన్డీయే కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.

- Advertisement -

అసదుద్దీన్ ఆ విధంగా నినాదం చేయడాన్ని తప్పుబడుతూ పలువురు బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా అమరావతి మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా అసదుద్దీన్ పై సీరియస్ అయ్యింది. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఓవైసీ తన ప్రమాణం స్వీకారం కార్యక్రమంలో జై పాలస్తీనా నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్ కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారంటూ ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.

- Advertisement -

కాగా, జూన్ 25న అసదుద్దీన్ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణంలో అసదుద్దీన్ ఓవైసీ.. జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని కేంద్రమంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధ మోహన్ సింగ్ స్పందించారు. ఓవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామంటూ స్పష్టం చేశారు. తాజాగా నవనీత్ కౌర్ కూడా రాష్ట్రపతికి లేఖ రాసి ఓవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

Also Read: నీట్‌పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్

ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్.. ఎంపీ అసదుద్దీన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఓవైసీపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి తరఫున నవనత్ కౌర్ ప్రచారం చేశారు. ఆశ్చర్యపరిచే విషయమేమంటే.. వీరిద్దరూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News