Big Stories

Ayodhya Ram Temple Roof Leaking: తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్.. విపక్షాలకు చిక్కిన ప్రధాని మోదీ!

Ayodhya Ram Temple Roof Leaking: అయోధ్య రామమందిరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ గుడి నిర్మాణానికి వేర్వేరు ప్రాంతాల నుంచి మెటీరియల్‌ను తెప్పించారు. అవన్నీ నిర్మాణంలో వినియోగించారు. ఆఘుమేఘాల మీద వేగంగా పనులు చేయించారు. ఎంతో ఘనంగా దీన్ని ప్రారంభించారు. కాలం మారింది.. వింటర్, సమ్మర్ పోయి.. వర్షాకాలం మొదలైంది.

- Advertisement -

రామమందిరం నిర్మాణంలోని లోపాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా శనివారం అయోధ్యలో భారీ వర్షం పడింది. ఈ సీజన్‌లో అక్కడ పడిన తొలి వర్షం అదే. వర్షం కారణంగా గుడిలో లీకేజీ సమస్య బయటపడింది. పైకప్పులో మొదలైన లీకేజీ ఏకంగా గర్భగుడిలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన చీఫ్ ఆచార్య సతేంద్రనాద్ స్వయంగా వెల్లడించారు.

- Advertisement -

వర్షపు నీరు సరిగ్గా రామ్‌లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చుని వీఐపీలు దర్శనం చేసుకునే ఏరియా లీక్ అయినట్టు తెలిపారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మనసులోని మాట బయటపెట్టారు. అంతేకాదు వర్షం నీరు పోయేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేదు.

Also Read: రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా

మందిరం పైకప్పు లీకేజీ గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర రియాక్ట్ అయ్యారు. పైకప్పు వాటర్ ఫ్రూప్‌గా మార్చేందుకు మరమ్మతులు చేయాలని సూచన చేశారు. మొదటి అంతస్తు పనులు జులై చివరికి అవుతుందని, మందిరం మొత్తం పూర్తి అయ్యేసరికి ఈ ఏడాది చివరి నెల కావచ్చని వెల్లడించారు.

అయోధ్య రామమందిరంలో వాటర్ లీక్ వ్యవహారం ఇప్పుడు విపక్షాల అస్త్రంగా మారింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. దీని తర్వాత స్పీకర్ ఎన్నిక కాగానే అయోధ్య రామమందిరం ఇష్యూని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నాయి విపక్షాలు.

Also Read: పీఎం మోదీకి ఖర్గే కౌంటర్.. ఇంకెంతకాలం అవే మాటలు

ఈ అంశం ద్వారా ప్రధాని నరేంద్రమోదీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోసమే బీజేపీ ప్రభుత్వం మందిరం నిర్మాణం చేసిందని కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు అప్పుడు గొంతెత్తాయి. అంతేకాదు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి పలు రాజకీయ పార్టీల నేతలు దూరమయ్యారు. లీకేజీ వ్యవహారంపై రాబోయే సమావేశాల్లో హాట్ హాట్ చర్చ జరగడం ఖాయమని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News