Big Stories

Assam Floods: అస్సాంను వేధిస్తున్న వరదల సంక్షోభం..తిండి లేక తిప్పలు!

Flood Situation in Assam Worsens: అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల్లో దాదాపు లక్షకు మందికి పైగా ప్రభావితమయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. సోమవారం నాటికి ఎనిమితి జిల్లాల్లో బాధితుల సంఖ్య 1.05లక్షలు అని పేర్కొంది. వరదలు, తుఫానుల కారణంగా బక్సా, బార్‌పేట, దర్రాంగ్, ధేమాజీ, గోల్ పరా, కరీంగంజ్, నాగావ్, నల్బరీ జిల్లాల్లో 1,05,700 మందికి పైగా బాధితులు నిర్వాసితులయ్యారు.

- Advertisement -

అత్యధికంగా కరీంగంజ్‌లో 95,300 మంది వరదలకు ప్రభావితులయ్యారని పేర్కొంది. తీవ్రంగా దెబ్బతిన్న ఇతర జిల్లాల్లో చాలామంది నిర్వాసితులయ్యారు. నాగావ్‌లో 5వేల మంది ప్రభావితమయ్యారని, 3,600 మందిపైగా దేమాజీ వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 6వేల మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. అలాగే ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 34కి చేరిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది.

- Advertisement -

సహాయక శిబిరాలు..
వరదల బీభత్సానికి గురైన ప్రాంతాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాకు సుమారు 11 సహాయక శిబిరాలు చర్యలు చేపట్టాయి. ఈ శిబిరాల్లో 3,168 మంది ఆశ్రయం పొందుతున్నారు. అలాగే ఒక్కో జిల్లాలో మూడు సహాయక పంపిణీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

Also Read: నిజంగా ఈవీఎంలను హ్యక్ చేయవచ్చా? మధ్యలో మస్క్ పంచాయితీ ఏంటీ?

వరద బాధితులకు ఫుడ్ సరఫరా చేస్తున్నారు. ఈ మేరు గత 24 గంటల్లో ఒక్కో శిబిరానికి 21.5 క్వింటాళ్ల బియ్యం 3.81 క్వింటాళ్ల పప్పు, 1.12 క్వింటాళ్ల ఉప్పు, 114 లీటర్ల నూనెను ప్రభుత్వం పంపిణీ చేసింది.

దెబ్బతిన్న పంటలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద బీభత్సానికి 309 గ్రామాలు నీటమునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,005.7 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. ప్రధానంగా బొంగైగావ్, చిరాంగ్, ధేమాజీ, గోల్‌పరా, హోజాయ్,నాగావ్, తముల్ పూర్, దర్రాంగ్, నల్బరి, లఖింపూర్, ఉదల్ గురి ప్రాంతాల్లో రోడ్డు, వంతెనలు, ఇతర కమ్యూనికేషన్స్‌లకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీంతో రవాణా సైతం స్థంభించిపోయిందని ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News