Big Stories

Power Bills: సీఎం కీలక నిర్ణయం.. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ..

Himanta Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తాను, చీఫ్ సెక్రటరీ జులై 1 నుంచి ఈ నిబంధనను అనుసరిస్తామని తెలిపారు.

- Advertisement -

‘రాష్ట్రంలో గత 75 ఏళ్లుగా మంత్రులు, ప్రభుత్వ సీనియర్, సచివాలయ అధికారుల నివాసాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రజలు చెల్లించే ట్యాక్స్ సొమ్ముతో ప్రభుత్వ అధికారులకు విద్యుత్ బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాము. నేను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జులై 1 నుంచి మా విద్యుత్ బిల్లులను మేమే చెల్లించడాన్ని ప్రారంభిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులంతా వారి విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అంటూ హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విధానాన్ని అనుసరిస్తే విద్యుత్ బోర్డుకు వచ్చే నష్టాలను నివారించవచ్చన్నారు. బదులుగా వారు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉండబోదంటూ ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

అస్సాంలోని గువాహటిలో ఉన్న రాష్ట్ర సెక్రటేరియేట్ కాంప్లెక్స్ లో జరిగిన ఓ వేడుకలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల గ్రిడ్ – కనెక్ట్ రూఫ్ టాప్, గ్రౌండ్ -మౌంటెడ్ సోలార్ పీవీ సిస్టమ్ ను, జనతా భవన్ సోలార్ ప్రాజెక్టును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ పవర్ ను దశలవారీగా వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు.

Also Read: బెంగాల్ రైలు ప్రమాదం.. ప్రభుత్వంపై దీదీ సీరియస్..

విద్యుత్ ను ఆదా చేయడానికి సీఎం సెక్రటరీ, హోం, ఆర్థిక శాఖలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రి 8 గంటలకు విద్యుత్తు ఆటో-డిస్ కనెక్షన్ అమలు చేసేందుకు కృష్టి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే 8 వేల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News