Big Stories

Amritpal Singh: జైలులో ఖైదీగా ఉంటూ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అమృత్‌పాల్‌

Amritpal Singh wins in Lok Sabha Elections(Today’s news in telugu): 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఫలితాల్లో ఊహించని వ్యక్తులు ఓటమి పాలవ్వడం, అసలు ఊహించని వ్యక్తులు గెలుపొందడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఓ వైపు ఎన్నికల్లో భారీగా ప్రచారాలు చేసిన బడా నాయకులు కూడా గెలుపొందుతున్న క్రమంలో, వారికే పోటీ ఇస్తూ జైలు నుంచి పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. పంజాబ్ లో వేర్పాటు వాది అయిన అమృత్ పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికలు 2024లో ఘన విజయం సాధించారు. ఖదూర్ సాహిడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు.

- Advertisement -

అయితే అమృత్ పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ప్రస్తుతం ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలో జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనను ప్రజలు గెలిపించడం ఆసక్తిగా మారింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుల్బీర్ సింగ్ జిరాకు 1,96,279 ఓట్లు వచ్చాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News