Big Stories

Amritpal and Rashid No Oath: ఇద్దరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయలేదు.. అమృత్‌పాల్‌, రషీద్ మాటేంటి..?

Amritpal and Rashid No Oath: 18వ లోక్‌సభ కొలువుదీరింది. కొంతమంది సభ్యులు మినహా దాదాపుగా అందరూ ప్రమాణ స్వీకారం చేసేశారు. అందులో ఇద్దరు సభ్యుల గురించే అసలు సమస్య. ఒకరు అమృత్‌పాల్ సింగ్ కాగా, మరొకరు ఇంజనీర్ రషీద్. వీళ్లిద్దరు ప్రస్తుతం జైలులో ఉన్నారు.

- Advertisement -

వీళ్లతో ఎంపీలుగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారా? లేదా అన్న డౌట్ మాత్రం చాలామందిని వెంటాడుతోంది. వాళ్లపై నమోదు చేసిన అభియోగాలు పరిశీలిస్తే.. ప్రమాణ స్వీకారానికి అర్హులు కారు. కాకపోతే జైలులో ఉండే ఆ ఇద్దరు నేతలు గెలిచారు.  ఇటు ప్రభుత్వం,  అటు న్యాయస్థానం ఆలోచన ఏ విధంగా ఉండబోతుందనేదే అసలు ప్రశ్న.

- Advertisement -

ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్, తీవ్రవాది ఇంజినీర్ రషీద్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరు జైలు నుంచే గెలిచారు. లోక్‌సభలో కొంతమంది సభ్యులు మినహా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు సభ్యులపై వ్యవహారంపై అసలు చర్చ. ప్రస్తుతం వారిద్దరు జైలులో ఉన్నారు. అమృత్‌పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగర్‌ జైలులో, ఇంజనీర్ రషీద్ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.

Also Read: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా, ప్రధాని మోదీ, రాహుల్ శుభాకాంక్షలు

పంజాబ్‌లోని ఖదూర్ సామిడ్ సీటు నుంచి ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కుల్బీర్‌సింగ్ జీరాపై లక్షన్నర వేలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అమృత్ పాల్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఆయనకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అన్నదే అసలు పాయింట్.

మరొకరు జమ్మూకాశ్మీర్ కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్. అందరూ ఆయన్ని ఇంజనీర్ రషీద్ అంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో ఉన్నారు. టెర్రరిస్టులకు నిధుల విషయంలో ఎన్ఏఐ ఈయన్ని అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన జైలులో ఉన్నారు.

Also Read: President Murmu speech: రాష్ట్రపతి ప్రసంగం.. పేపర్ లీక్‌లు, ఆప్ ఎంపీలు దూరం

తన ప్రమాణ స్వీకారానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ కోర్టును రషీద్ తరపు న్యాయవాది ఆశ్రయించారు. ఆ పిటిషన్ జూలై ఒకటిన విచారణకు రానుంది. ఈలోగా ఎన్ఐఏ ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది. ఇప్పటివరకు అభియోగాలు మాత్రమే మోపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు  అమృత్‌పాల్ సింగ్ ఇటు రషీద్‌లకు మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశముందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News