Big Stories

Akhilesh Yadav: ఎంపీగానే కొనసాగుతా.. అఖిలేష్‌ యాదవ్‌ కీలక ప్రకటన!

Akhilesh Yadav Key Decision: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఎంపీ అభ్యర్థిగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అఖిలేష్‌ యాదవ్‌ తాను ఎంపీగానే కొనసాగుతానని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలతో అఖిలేష్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగానే కొనసాగుతానని , త్వరలో ఎమ్మెల్యే పదవి వదులుకుంటానని చెప్పారు.

- Advertisement -

కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలతో పాటు, మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం కార్యకర్తలతో కూడా మాట్లాడానని, వారికి కూడా అదే విషయం చెప్పానని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అంతకు ముందు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కర్నాల్ అసెంబ్లీ స్థానంలో గెలిచి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Also Read: ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు..!

ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్ పురి జిల్లాలో కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కర్హాల్ ఒకటి. ఈ ఎన్నికల్లో మెయిన్ పురి లోక్‌సభ స్థానం నుంచి అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలుపొందారు. ఈ క్రమంలోనే అఖిలేష్ యాదవ్ మెయిన్ పురి, కర్హల్ నియోజకవర్గాల ప్రజలతో సమావేశమై తన నిర్ణయాన్ని తెలిపారు. అదే నిర్ణయాన్ని ఈ రోజు సమావేశంలో కూడా ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News