Big Stories

Akhilesh Yadav attack on Modi govt: లోక్‌సభలో ఎంపీ అఖిలేష్ ఎదురుదాడి, బీజేపీ ఉక్కిరి బిక్కిరి

Akhilesh Yadav attack on Modi govt(Telugu news live today): దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్‌సభ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. బలమైన ప్రతిపక్షం ఉండడంతో మోదీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రత్యర్థుల విమర్శల నుంచి తప్పించుకునేందుకు చరిత్రను తెరపైకి తెస్తోంది ఎన్డీయే సర్కార్.

- Advertisement -

సోమవారం మోదీ సర్కార్‌‌‌పై తీవ్రస్థాయిలో బాణాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. యువనేత ఆరోపణలకు బీజేపీ ఎంపీలంతా కుర్చీల నుంచి పైకి లేవాల్సి వచ్చిందంటే సమావేశాలు ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ఇండియా కూటమి తరపున ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ మాట్లాడారు.

- Advertisement -

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ లోక్‌సభలో ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. 2024 ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలు బాధ్యతతో కూడిన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఈసారి మతతత్వ రాజకీయాలు ఓడిపోయాయని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజలు ఓటు వేశారన్నారు. ముఖ్యంగా విభజన రాజకీయాలను ప్రజలు దూరంగా పెట్టారన్నారు.

తొలుత అయోధ్య ఎన్నికల ఫలితాలపై ఎంపీ అఖిలేష్ నోరు విప్పారు. అయోధ్య ఓటర్లు పరిణితి చెందిన ఓటర్లని, అక్కడ ప్రజాస్వామ్య విజయమన్నారు. యూపీలో అభివృద్ధి పేరిట అవినీతి జరుగుతోందని తూర్పారబట్టారు ఎంపీ అఖిలేష్. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం అన్ని అవాస్తవాలు చెబుతోందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామన్నారు.

ALSO READ: పార్లమెంట్‌లో శివాలెత్తిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై ఫైర్..

ఎంతోమంది యువత ఆకాంక్షలను అగ్నివీర్ నెరవేర్చడం లేదని, ఉపాది అవకాశాలు కల్పించడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. తాము కుల గణనకు అనుకూలంగా ఉన్నామని గుర్తు చేశారు అఖిలేష్ యాదవ్. పంటలకు ఇచ్చే ఎంఎస్పీ విషయంలో చట్టపరమైన హామీ ఇవ్వాలన్నారు. అలాగే ఉద్యాన పంటలకు దీన్ని వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని, ఈ సమస్య చావలేదని కుండబద్దలు కొట్టేశారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News