Big Stories

Air India : విమానంలో జర్నలిస్ట్‌కు చేదు అనుభవం.. భోజనంలో బ్లేడ్.. ఆ తర్వాత ?

Blade in Meal: విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. అందులో తనకు సెర్వ్ చేసిన భోజనాన్ని తింటుండగా.. అతనికి నోటిలో ఓ వస్తువు గుచ్చుకున్నట్లు అనిపించింది. వెంటనే ఆ వస్తువును నోటిలోంచి బయటకు తీసి చూసి షాకయ్యాడు. తీరా చూస్తే అది బ్లేడ్. దీంతో ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే ఆ భోజనాన్ని తీసుకెళ్లి, మరో పార్శిల్ ను తెచ్చి ఇవ్వబోతుండగా.. వెంటనే దానిని నిరాకరించాడు. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విమాన సంస్థ కూడా ఈ విషయంలో తమదే పొరపాటని అంగీకరించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది.

- Advertisement -

ఇటీవల బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న విమానంలో మాథుర్స్ పాల్ అనే ఓ జర్నలిస్ట్ ప్రయాణించాడు. ఆ జర్నీలో అతనికి చేదు అనుభవం ఎదురయ్యింది. విమానంలో సిబ్బంది అతనికి భోజనం అందించారు. దీంతో అతను ఆ భోజనాన్ని తింటున్నాడు. అయితే ఆ భోజనంలో మెటల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించాడు. తాను దానిని తన నోటిలో రెండుమూడు సెకన్లపాటు నమిలిన తరువాత అది తన ఆహారంలో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పాడు. తాను ప్రయాణించిన విమానం ఎయిర్ ఇండియాది అంటూ ఈ బాధాకరమైన అనుభవాన్ని ఆ జర్నలిస్ట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

- Advertisement -

ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది.. వెంటనే తనకు మరో పార్శిల్ ను అందించబోయారని, కానీ.. తాను దానిని తిరస్కరించినట్లు చెప్పాడు. ఈ సంఘటనపై కొన్ని రోజుల తరువాత ఎయిర్ ఇండియా సంస్థ స్పందించి క్షమాపణలు చెప్పిందన్నాడు. అంతేకాదు తనకు లేఖ కూడా రాసిందని.. జరిగిన నష్టానికి పరిహారంగా ప్రపంచంలో ఎక్కడికైనా ఉచిత బిజినెస్ క్లాస్ ట్రిప్ ను ఆఫర్ ను చేసిందని తెలిపాడు. కానీ.. ఆ ఆఫర్ ను తాను తిరస్కరించినట్లు అందులో పేర్కొన్నాడు.

ఈ విషయంపై సదరు సంస్థ కూడా స్పందిస్తూ ఈ సంఘటన నిజమేనని తెలిపింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Also Read: మార్కెట్ దద్దరిల్లిపోవాల్సిందే.. జాతరకు సిద్ధమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. పోటీని తట్టుకోగలరా..?

విమానంలో వరుస సమస్యల కారణంగా ప్రయాణికుల నుంచి ఎయిర్ ఇండియా సంస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలువురు ప్రయాణికులు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తిని తెలియజేశారు. పలువురు బిజినెస్ క్లాస్ ప్రయాణికులైతే ముఖ్యంగా టికెట్ల అధిక ధరకు సంబంధించిన సమస్యలను కూడా నివేదించారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన సంస్థ అంతర్గతంగా వాటిని దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News