Big Stories

Aadhar Update: ఆధార్ కార్డుదారులకు శుభవార్త.. మరోసారి గడువు పెంపు

Aadhar Update: ఆధార్ కార్డుదారులకు శుభవార్త. ఉచిత ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం మరోసారి గడువు పొడిగించారు. కేంద్రం ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. గతంలో ఉచితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునేందుకు గడువు జూన్ 14గా నిర్ణయించారు. ఈ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆధార్ ఉచిత గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు.

- Advertisement -

పదేళ్లకోసారి తప్పనిసరి

- Advertisement -

ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా అప్ డేట్ చేయాలని యూఐడీఏఐ సూచించింది. కార్డుదారులు తమ పేర్లతోపాటు చిరునామాను మార్చుకునేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో మొదట ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా మార్పుల కోసం 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జూన్ 14 వరకు పొడిగించారు. అయితే ప్రస్తుత రిపోర్టు ప్రకారం.. దేశంలో ఆధార్ కార్డు మార్పులు చేసుకునే వారు చాలామంది ఉండడంతో మళ్లీ పొడిగించింది. వీలైనంత త్వరగా ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ప్రతి 10 ఏళ్లకోసారి ఆధార్ కార్డులోని బయోమెట్రిక్స్, చిరునామాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.

Also Read: ఐస్‌క్రీమ్‌లో ఫింగర్, షాకైన డాక్టర్, ఏమైంది?

ఆప్ డేట్ ఇలా..

ఆన్ లైన్‌లో ఆధార్ కార్డును అప్ డేట్ చేసేందుకు https://myaadhaar.uidai.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి తర్వాత ఆధార్ నంబర్ తో లాగిన్ కావాలి. మీ రిజస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దీని సహాయంతో డాక్యుమెంట్ అప్ డేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మార్చుకోవాల్సి ఉంటుంది. అదే వెబ్ సైట్ లో చిరునామా అప్ డేట్ ఎంచుకోవాలి. ఆ తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్ లైన్ ఎంపిక చేసుకొని అడ్రస్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఆధార్ అప్ డేట్ చేయడానికి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్కాన్ చేసిన కాపీ, వేలిముద్ర, ఐరిస్ స్కాన్ సమాచారాన్ని నమోదు చేయాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News