EPAPER

Green Corridor : టాఫ్రిక్ ఇన్‌స్పెక్టర్‌ సమయస్ఫూర్తి .. విద్యార్థి కోసం గ్రీన్ కారిడార్.. ఎందుకంటే..?

Green Corridor : టాఫ్రిక్ ఇన్‌స్పెక్టర్‌ సమయస్ఫూర్తి .. విద్యార్థి కోసం గ్రీన్ కారిడార్.. ఎందుకంటే..?

Green Corridor :గ్రీన్ కారిడార్ ఈ పదం ఎక్కువగా అవయవాల తరలింపు సమయంలో వింటూ ఉంటాం. ట్రాఫిక్ ను ఎక్కడకక్కడే నిలిపివేసి..ఒకే వాహనం వెళ్లేలా చేయడమే గ్రీన్ కారిడార్. రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు, మంత్రులు లాంటి వీఐపీలు వెళ్లేటప్పుడు ఇదే విధానాన్ని అనుసరిస్తారు. కానీ ఓ స్టూడెంట్ కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన ఘటన కోల్ కతాలో జరిగింది. అసలు ఏం జరిగింది? ఎందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారో వివరాలలోకి వెళితే..


కోల్ కతాలోని హావ్ డా వంతెన సమీపంలో రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఉదయం 11.20 గంటలకు ఓ విద్యార్థి పాఠశాల యూనిఫామ్ లో అక్కడ ఉంది. ఈ విద్యార్థి కళ్లలోంచి కన్నీళ్లు వస్తున్నాయి. తనను ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్లాల్సిందిగా చాలామందిని సాయం కోరింది. కానీ ఎవరూ ఆమె మొర ఆలకించలేదు. ఇంతలో ఆ అమ్మాయిని గమనించిన ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించారు. తాను శాయంబజార్ లోని ఆదర్శ శిక్ష నికేత్ పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్ష రాయాలని చెప్పింది. దీంతో వెంటనే ఆ ఇన్ స్పెక్టర్ పోలీస్ వాహనంలో ఎక్కించుకున్నారు. పరీక్షా కేంద్రం వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం పంపారు. అంతే ఆ రహదారిలో ట్రాఫిక్ ఎక్కడకక్కడే ఆగిపోయింది. ఆ అమ్మాయిని పోలీస్ వాహనంలో పరీక్ష కేంద్రానికి కేవలం 10 నిమిషాల్లో చేర్చారు. ఆ విద్యార్థి వాహనం దిగి ఉత్సాహంగా ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లింది. సంతోషంగా పరీక్ష రాసింది.

మరో విషయమేమిటంటే ఆ విద్యార్థి తాత ఆ రోజే చనిపోయారు. కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియల కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. దీంతో పరీక్ష కేంద్రానికి ఆమెను తీసుకెళ్లేవారు ఎవరూ లేకపోవడంతో తానే బయలుదేరింది. అలా హావ్ డా బ్రిడ్జి సమీపంలోని రోడ్డు వద్దకు వచ్చి సాయం కోసం ఎదురుచూసింది. ఆ విషయం తెలియగానే ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి ఆ అమ్మాయిని ఎలాగైనా పరీక్ష కేంద్రానికి తరలించాలని సంకల్పించారు. తన కుమార్తె 11వ తరగతి చదువుతోందని ఆయన తెలిపారు. విద్యార్థులు పడే టెన్షన్ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. అందుకే ఆ విద్యార్థిని ఎలాగైనా పరీక్ష కేంద్రానికి చేర్చాలని అనుకున్నానని చెప్పారు. ఆ ఇన్ స్పెక్టర్ సమయస్ఫూర్తితో ఆ విద్యార్థి పరీక్ష రాసింది.


Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్..మనీష్ సిసోడియా అరెస్ట్..

Sonia Gandhi : సోనియా అలా అనలేదు.. రిటర్మైంట్ పై కాంగ్రెస్ క్లారిటీ..

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×