Big Stories

New Criminal Laws: అమలులోకి రానున్న చట్టాలు.. నేరాలకు పాల్పడితే ఇక మీ పని అంతే !

New Criminal Laws(National news today India): కేంద్రం రూపొందించిన కొత్త చట్టాలు సోమవారం అమలులోకి రానున్నాయి. న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకువచ్చేలా క్రిమినల్ చట్టాలను రూపొందించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్ధానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం, నాగరిక్ సురక్ష సంహిత అమలు కానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించింది.

- Advertisement -

ఈ చట్టాల వల్ల జీరో ఎఫ్ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్‌ఎం‌ఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలు తప్పనిసరిగా వంటి నిబంధనలు అమలులోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశ ద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయని కేంద్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

శిక్షల కంటే న్యాయం కోసమే..
కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికే ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపుతో పాటు, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో సవరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. చట్టాలు కేవలం పేరు మార్పుకే కారణం కాదని, చట్టాల్లో పూర్తి సవరణలు తీసుకువచ్చామని అన్నారు. ఈ నూతన చట్టం భారతీయులే రూపొందించారన్న అమిష్ షా కొత్త ఆర్థిక చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయన్ని నిర్థారిస్తాయని అన్నారు.

Also Read: సీఎం స్టాలిన్ ప్రకటన, తెరపైకి కొడనాడు కేసు, డైవర్ట్ పాలిటిక్స్..

చట్టాల్లోని కొన్ని ప్రత్యేకతలు

కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపే అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితుల నివేధికలు 7 రోజుల్లోనే రావాలి. పిల్లలను కొనడం, అమ్మడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తారు. మైనర్ పై సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. అంతే కాకుండా సాక్షల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్షాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డీజీ లాకర్‌‌లో భద్రపరుస్తారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పుడు వాగ్దానాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై కూడా కొత్త చట్టాల్లో కఠిన శిక్షలు ఉన్నాయి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News