Big Stories

Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి..

Chhattisgarh Encounter: దండకారణ్యం మరోసారి తుపాకీ తూటాలతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణపూర్‌లో సైనికులు-మావోయిస్టుల మధ్య మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 4 జిల్లాల నుంచి 1400 మందికి పైగా సైనికులు అబుజ్మడ్‌లోకి ప్రవేశించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు.

- Advertisement -

అభుజ్మడ్‌లోని కోహ్కమేటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో వివిధ భద్రతా దళాలకు చెందిన ఉమ్మడి బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా కాల్పులు జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని.. 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. పక్షం రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.

- Advertisement -

Also Read: అంతా నిశ్శబ్దం.. చెట్లపై బుల్లెట్ గుర్తులు.. నెత్తురోడిన దండకారణ్యం..

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆపరేషన్ కగార్ పేరిట మావోల ఏరివేత ప్రారంభించారు. దాదపు వందకు పైగా మావోలను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. విప్లవ సంఘాలు మాత్రం ఇవన్ని భూటకపు ఎన్‌కౌంటర్లని వెంటనే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News