Big Stories

Dombivli Blast: 11కు చేరిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కిందే..

Dombivli Blast: మహారాష్ట్రలోని థానేలో డోంబివిలీ ఏరియాలో గురువారం జరిన పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అముదన్ కెమికల్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలోని బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే ఈ ఘటనలో 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

అయితే పేలుడు ధాటికి కూలిన భవన శిథిలాలను సహాయక సిబ్బంది తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పేలుడు సంభవించిన అముదాన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజయానులు మాలతీ ప్రదీప్, ఆమె కుమారుడు మలాయ్ ప్రదీప్. ఫ్యాక్టరీ నిర్వహణ లోపాల కారణంగానే పేలుడు సంభవించడంతో పోలీసులు యజమానులపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

పేలుడు జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాలతీ ప్రదీప్ మెహతా పరారయ్యారు. దీంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు నాసిక్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడు పరారీలో ఉండగా అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరి కొందరు ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: హెలికాప్టర్‌కు తప్పినముప్పు, ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో భక్తులు

గురువారం ఫ్యాక్టరీలో పేలుడు సంభవించగా ఒక్క సారి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అనంతరం చుట్టూ ఉన్న ప్రాంతాలకు దట్టమైన పొగలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లోని జనం భయంతో పరుగులు తీసారు. మొదట రెండు భవనాలకు మంటలు వ్యాపించగా మంటల్లో చిక్కుకుని నలుగురు మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని 15 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేసారు. ఆ ప్రమాదంలో పలు వాహనాలు కాలిపోయాయి. నిన్నటి నుంచి ఘటన జరిగిన ప్రదేశంలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News