Big Stories

W.H.O about Corona : గాయాలు మానినా పుండు మానలేదు.. కరోనాపై కళ్లు బైర్లు కమ్మే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ

W.H.O about Corona(Health news today) : ఏమిటో నిన్నటి నుంచి ఎడమ కన్ను అదే పనిగా అదురుతోంది. ఏదో సిక్స్‌త్ సెన్సో, సెవెన్త్ సెన్సో గానీ ప్రమాద హెచ్చరికలు పంపిస్తూనే ఉంది. ఏంటా అని ఆలోచిస్తే.. సైంటిస్టుల మాటలు అని తేలింది. వాళ్లేం చెప్పారు అంటారా.. అదే అండీ కరోనా గురించి.. వాళ్లు చెప్పిన మాటలకు కళ్లు బైర్లు కమ్మి.. చెమటలు మొదలయ్యాయి. మన దేశంలోకి కరోనా ప్రవేశించి.. దేశాన్ని అల్లకల్లోలం చేసి దాదాపు నాలుగేళ్లవుతోంది. దాని వల్ల కకావికలమైన జీవితాలెన్నో! అనాథలుగా మిగిలిన చిన్నారులెందరో! అన్ని వర్గాల ప్రజలనూ మహమ్మారి కష్టాల ఊబిలోకి నెట్టేసింది. జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు మన ఆయుష్షుకూ పొగ బెట్టేసింది. మన ఆయువులో రెండేళ్లు కోత పెట్టింది. అవును.. ఇవి మేము చెప్తున్న మాట కాదు.. డబ్ల్యూహెచ్ వో చెప్పిన మాటలు.

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఏ పేపర్ చూసిన కరోనా గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. గాయాలు మానిపోయాయి అని మనం అనుకుంటుంటే.. పుండు ఇంకా మానలేదు అంటూ రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా మీ ఆయుష్షు తగ్గిపోయిందంటూ మరో హెచ్చరిక బయటకొచ్చింది. రెండేండ్ల పాటు గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రభావంతో మనుషుల సగటు ఆయుష్షు దాదాపుగా రెండేండ్లు తగ్గిపోయింది. కరోనా ఎఫెక్ట్ తో అప్పుడే పుట్టిన పిల్లల హెల్దీ లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ సైతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ వైరస్ వల్ల ఇలాంటి ప్రభావమే కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ నివేదికలో వెల్లడించింది.

- Advertisement -

హెల్త్ సెక్టార్ లో 2012 నుంచి పదేండ్లలో స్థిరంగా సాధించిన ఫలితాలు కరోనా కారణంగా రెండేండ్లలోనే తారుమారు అయిపోయి, మళ్లీ పదేండ్ల కిందటి స్థాయికి పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూహెచ్ఓ. 2019 నుంచి 2021 మధ్య ప్రపంచ సగటు ఆయుర్దాయం 1.8 ఏండ్లు తగ్గిందట. 2012లో గ్లోబల్ లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ 71.4 ఏండ్లుగా ఉండగా.. ఇన్నేండ్లలో హెల్త్ రంగంలో సాధించిన అభివృద్ధితో అది 1.8 ఏండ్లు పెరిగింది. కానీ కరోనా వల్ల 2019 నాటికి సాధించిన ఫలితాలు రెండేండ్లలోనే తిరిగి 2012కు రివర్స్ అయ్యాయి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లల ఆయుర్దాయం అంచనా కూడా 1.5 ఏండ్లు తగ్గిపోయింది అని నివేదికలో డబ్ల్యూహెచ్ వివరించింది. అయితే, అమెరికా ఖండాలు, ఆగ్నేయాసియాలో వైరస్ ప్రభావంతో పెద్దల ఆయుస్సు 3 ఏళ్ల వరకు, పిల్లల ఆయుస్సు రెండున్నరేళ్లు తగ్గగా.. ఇక పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో మాత్రం అత్యంత తక్కువగా నెలా, రెండునెలలు మాత్రమే తగ్గినట్టు తెలిపింది.దీంతో కరోనా బాధితులకు కొత్త భయం అంటుకుంది.

కరోనాకు టీకా వేసుకున్నాం కదా.. అని చాలామంది కర్ఛీఫ్ వేసుకోని కూర్చుంటే.. అది కూడా ప్రమాదమే అయింది అని తాజాగా కుండబద్దలు కొట్టాయి సదరు కంపెనీలు. ఆ మధ్య అస్ట్రాజెనెకా టీకా వేసుకున్నా కొంత మందిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్స్ పడిపోవడం వంటివి జరిగాయి. మాకేంటీ ఈ రోగాలు అంటూ బాధితులు కోర్టు మెట్లు ఎక్కితే.. అవును ఇది మా తప్పే అంటూ నిజాన్ని ఒప్పుకుంది ఆస్ట్రాజెనెకా కంపెనీ. ఇది ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఇండియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇండియాలో దాదాపు 175 కోట్ల డోసులు వేశారు. బ్రిటిష్ ఉత్పత్తి వాక్సిన్‌ను మన దేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసి పంపిణీ చేసింది. సరే, యుద్ధప్రాతిపదికన ఓ వరల్డ్ మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి వేక్సిన్ల ప్రయోగఫలితాలు పూర్తిగా తేలకముందే పర్మిషన్లు ఇచ్చేసి కోట్ల డోసులు గుచ్చేశారు. అది అప్పుడు అత్యవసరం. ఆ అవసరం తీరాక కనీసం ప్రయోగ ఫలితాలను పూర్తిచేశారా..? సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంకేమైనా కార్యాచరణ ఉందా..? ప్రభుత్వమైనా ఒత్తిడి తీసుకొచ్చిందా..? అదేమీ లేదు.. వేల కోట్లు కుమ్మేశారు, జనాన్ని వాళ్ల కర్మకు వదిలేశారు.

మరో విషయానికొస్తే.. కోవిడ్ వచ్చిన చాలా మందిలో గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, లంగ్ డిసీజ్ లు, అల్జీమర్స్, డయాబెటిస్ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, మాల్ న్యూట్రిషన్ సమస్యలు కూడా పెరిగాయట. అవును.. ఇది అక్షరాల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ చెప్పిన నిప్పులాంటి నిజం. ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి 2021 మధ్యలో నమోదైన మరణాల్లో నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల వల్లే 74 శాతం మంది మరణించారట. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి మహమ్మారులు వస్తే ఎదుర్కొనేలా.. ప్రపంచ దేశాల మధ్య కొత్త ప్యాండెమిక్ అగ్రిమెంట్ కుదుర్చుకుని, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సర్.. సర్లే.. ఎన్నో చెప్తారు.. జనాన్ని భయపెట్టిస్తున్నారు అనుకోకండి. తస్మాత్ జాగ్రత్తగా.. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.

టీకాల వల్ల సైడ్ ఎఫెక్ట్ కొంతమందికే వస్తున్నాయి. కానీ.. కరోనా వదిలిన మరకలు మనకు, మన భావితరాలకు అంటుకుంటున్నాయి. మన ఆయుష్షే కాదు.. వారి ఆయుష్షు తగ్గింది. ఇప్పటికే వందేళ్లు బతకాల్సిన మనిషి.. 60 ఏళ్లకు వచ్చింది. ఇప్పుడు దానికి కూడా ఎసరు వచ్చి పడింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనేది అంతే నిజం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News