Big Stories

Amoebic Meningoencephalitis: ‘బ్రెయిన్ ఈటింట్ అమీబా’ అంటే ఏంటి.. దాని లక్షణాలు ఎలా ఉంటాయి ?

Amoebic Meningoencephalitis: ప్రపంచాన్ని తరచూ ఏదో ఒక వైరస్ భయంతో వణికిస్తోంది. ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చి ప్రాణాంతకర వ్యాధిగా మారి విషాదాన్ని నింపుతుంది. ఇలా ఎన్నో రకాల వైరస్ లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఇటీవల కరోనా మహమ్మారి కోట్ల మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ఇటీవల బ్రెయిన్ ఈటింట్ అమీబా అనే ఓ కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. అయితే అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి. ఇది ఎలా, ఎందుకు సోకుతుంది అనే వివరాలు చాలా మందికి తెలిసి ఉండదు.

- Advertisement -

సరస్సులు, నదుల వంటి వెచ్చని నీటిలో నివసించే ‘బ్రెయిన్-ఈటింగ్ అమీబా’ని నెగ్లేరియా ఫౌలెరి అని కూడా పిలుస్తారు. కలుషిత నీటిలో నివసించే ఈ అమీబా ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ముక్కు నుండి మెదడుకు ప్రయాణిస్తుంది. అక్కడ అది మెదడు కణజాలాన్ని నాశనం చేసి వాపుకు దారితీస్తుంది. క్రమంగా మెదడును చంపుతుంది.

- Advertisement -

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ లక్షణాలు-

– తలనొప్పి
-జ్వరం
– వికారం
-వాంతులు మరియు మానసిక స్థితి మారడం

ఒక వ్యక్తికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకిన తర్వాత, దాని లక్షణాలు 1 నుండి 12 రోజులలో కనిపించడం ప్రారంభిస్తాయి.

నివారణ మార్గాలు..

ఈ ఇన్ఫెక్షన్‌ సోకకుండా ఉండాలంటే కలుషిత నీటికి దూరంగా ఉండాలి. మాస్క్ లు ఉపయోగించడం మరియు నీటిని క్రమానుగతంగా శుభ్రపరచడం వంటి జాగ్రత్తలు అవసరం. మురికి నీటిలో ఈత కొట్టడం మానుకోండి. చెరువులు లేదా నిలిచిన నీటిలో స్నానం చేయవద్దు.

చికిత్స

ప్రస్తుతం, PAM కోసం ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో లేవు. అయినప్పటికీ, వైద్యులు యాంఫోటెరిసిన్ B, అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్ మరియు డెక్సామెథసోన్ వంటి మందులతో దీనిని నివారించడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పటికే పలు కేసులు నమోదు

కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో మరణించాడు. ఇది అరుదైన వ్యాధి అయినా కూడా తీవ్రమైన మెదడు ఇన్ఫెక్షన్. గత రెండు నెలల్లో కేరళలో ఈ ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా ముగ్గురు మరణించారు. మొదటి కేసు మే 21న మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక మృతి చెందగా, జూన్ 25న కన్నూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. మృదుల్ అనే చిన్నారి చిన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడని, ఆ తర్వాత అతనికి ఇన్ఫెక్షన్ సోకిందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News