Big Stories

West Nile Virus Symptoms: దోమల ద్వారా వెస్ట్ నైల్ వ్యాప్తి.. అసలు ఈ వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏంటి ?

West Nile Virus Symptoms: వర్షాకాలం మొదలైంది. వర్షాల కారణంగా కీటకాలు, దోమలు, ఈగలు వ్యాప్తిచెందుతాయి. వీటి కారణంగా వైరస్, ఇన్ఫెక్షన్లు, అంటు వ్యాధులు సోకుతుంటాయి. అయితే ముఖ్యంగా దోమల వల్ల ప్రాణాంతకర వ్యాధులు కూడా వస్తుంటాయి. అందులో సీజన్ మొదలైందంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ఎక్కువగా వస్తుంటాయి. అయితే దోమల వల్ల వెస్ట్ నైల్ అనే వైరస్ కూడా వ్యాపిస్తుందని చాలా మందికి తెలియదు.

- Advertisement -

ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా వెస్ట్ నైల్ సోకిన 21 కేసులు నిర్ధారించబడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. వెస్ట్ నైల్ వైరస్ సోకితే వైరల్ ఫీవర్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, వికారం వంటివి ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఈ వ్యాధి మెదడు, వెన్నుముకను కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ వైరస్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

- Advertisement -

వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి ?

వెస్ట్ నైల్ వైరస్ అనేది జూనోటిక్ వ్యాధి. అంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన వారిలో నరాల సంబంధిత వ్యాధులను కలిగిస్తుంది. చాలా సందర్భాలలో, దీని కారణంగా ప్రజలు మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లో 21 కేసులు నిర్ధారించబడ్డాయి.

వెస్ట్ నైల్ వైరస్ లక్షణాలు..

వెస్ట్ నైల్ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాంతులు మరియు వికారం, చర్మం దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణ చర్యలు..

దోమ కాటును నివారించడానికి, పొడవాటి చేతుల కలిగిన చొక్కాలు మరియు ప్యాంటు ధరించడం వల్ల ఈ వ్యాధి బారి నుండి రక్షించవచ్చు. దోమ తెరలను ఉపయోగించడం, దోమల వికర్షక క్రీమ్‌ను రాయడం వల్ల కూడా ఈ వ్యాధి సోకదు. దోమలు మురికి నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇంటి చుట్టూ టైర్లు, బకెట్లు, కుండల కింద నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. కిటికీలు, తలుపులపై దోమతెరలను అమర్చితే మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News