Big Stories

Heart Attack: హార్ట్ ఎటాక్‌కు ముందు శరీరంలో కనిపించే లక్షణాలివే !

Warning Signs of Heart Attack: ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ఒకటి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్యలతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గుండెపోటును ముందుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులు కాస్త వయస్సు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి.

- Advertisement -

గుండె పోటును కొన్ని సంకేతాలను ద్వారా ముందుగానే గుర్తించి తగిన మందులు తీసుకోవడం ముఖ్యం. ఇందులో భాగంగా శరీరంలో గుండెపోటుకు ముందు 5 లక్షణాల గురించి తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఛాతినొప్పి:
గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతి నొప్పి కూడా ఒకటి. ముఖ్యంగా ఛాతి ఎడమవైపు లేదా మధ్యలో తేలికపాటి నుంచి అసౌకర్యమైన నొప్పి, ఒత్తిడి బిగుతుగా అనిపించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. 2018 లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం గుండెపోటుకు చికిత్స చేయించుకున్న వారిలో 70% మంది ఒక రకమైన ఛాతి నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. ఈ పరిశోధనలో పలువురు కార్డియాలజిస్టులు పాల్గొన్నారు. ఛాతి నొప్పి గుండెపోటును సూచించే అత్యంత సాధారణ హెచ్చరికల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.

ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి లేదా అసౌకర్యంగా ఉండటం అంతే కాకుండా ఆ నొప్పి తరచుగా ఛాతి నుంచి ఎడమచేయి వరకు వ్యాపించడం వంటి లక్షణాలున్నట్లయితే ముందుగా జాగ్రత్త పడడం మంచిది. ఇది గుండెపోటుకు మరొక హెచ్చరిక కూడా కావచ్చు. కొన్నిసార్లు అది భుజాలు, వీపు రెండింటికి కూడా వ్యాపిస్తుంది.

గొంతు, దవడ నొప్పి:
కొంతమందిలో గొంతు, దవడ నొప్పి లక్షణాలు గుండెపోటును సూచించే ముందస్తు హెచ్చరిక సంకేతాలు. నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు గొంతు లేదా కింది దవడ నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి పంటి నొప్పి, శ్వాస ఆడకపోవడం మెడలో ఒత్తిడి, వంటి సమస్యలకు దారితీస్తుంది.
పొత్తి కడుపులో నొప్పి కొన్నిసార్లు గుండెపోటును సూచిస్తున్న నిపుణులు చెబుతున్నారు. ఈ నొప్పి వాంతితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అలాంటి సమయంలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నో పెయిన్:
10% మందికి దాదాపు గుండెపోటు తేలికపాటి నొప్పి లేకుండా కూడా వస్తుంది. దీనిని సైలెంట్ మయోకార్డియల్ ఇస్కీమియా అని పిలుస్తారు. ఇది మధుమేహం, వృద్ధులు, నరాల వ్యాధులు ఉన్న రోగులలో వస్తుంది. ఏదేమైనప్పటికీ గుండెపోటు లక్షణాలు వివిధ వ్యక్తుల్లో విభిన్నంగా ఉంటాయని తెలుసుకోవాలి.

Also Read: బట్టతల రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

ఈ లక్షణాలతో పాటు నిరంతరంగా చెమట, మైకం, ఆందోళన ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ECG, ECHO, బ్లడ్ టైటర్స్ వంటి సాధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా అది గుండెనొప్పి లేదా ఇతర ఏదైనా కారణమా అని తెలుసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News