Big Stories

Tomato Face Pack: టమోటా ఫేస్ ప్యాక్‌తో మెరిసే చర్మం మీ సొంతం.. ఇలా ట్రై చేయండి..!

Tomato Face Pack for Glowing Skin: టమోటాలు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. వీటిలో విటమిన్ సి, విటమిన్ k పుష్కలంగా ఉంటాయి. ఈరోజుల్లో అమ్మాయిలు అందం కోసం రకరకాల క్రీములు, మార్కెట్ లో దొరికే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. వేల వేల పైసలు పెట్టి బ్యూటీ పార్లర్ కి వెళుతూ ఉంటారు. ఇక నుంచి ఇలా చేయకండి.. మన ఇంట్లో దొరికే నేచురల్ ప్రొడక్ట్స్ తోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

- Advertisement -

టమోటా పేస్ ప్యాక్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టమోటా చర్మంపై మురికిని తొలగిస్తుంది. ముఖంపై మచ్చలు, టానింగ్ తొలగిస్తుంది. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ముఖ సౌందర్యం కోసం టమోటా ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందా..

- Advertisement -

టమోటా ఫేస్ ప్యాక్ చేయడానికి కావలసిన పదార్థాలు
టమోటా – 1
శెనగపిండి – 1 చెంచా
తేనె – అర టీస్పూన్

Also Read: నేరేడు పండ్లు తింటే ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్ !

టొమాటో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి
చిన్న టమోటాని తీసుకొని ముందుగా దాన్ని శుభ్రంగా కడగాలి. దాన్ని సగానికి కట్ చేసి శెనగపిండిలో ముంచి దాని పైన కొంచెం తేనె వేయాలి. దాన్ని ముఖంపై సున్నితంగా రుద్దుతూ స్క్రబ్ లాగా అప్లై చేయండి. అది ఆరిపోయేంత వరకు సుమారు 10-15 నిమిషాలు పడుతుంది. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టమోటా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
టమోటా ఫేస్ ప్యాక్ చేయడం వలన చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది.
ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
టమోటా ఫేస్ ప్యాక్ మీ స్కిన్ డ్యామేజ్‌ని రిపేర్ చేయడమే కాదు.. ట్యానింగ్‌ను తొలగించడంలో కూడా సహాయుడుపడతుంది. ఈ ఫేస్ ప్యాక్ మొటిమల సమస్యల నుండి దూరం చేస్తాయి. బ్లాక్ హెడ్స్ ను  తొలగించడంలో సహాయపడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News