Big Stories

Lipstick Side Effects: లిప్‌స్టిక్ వేసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు గ్యారంటీ !

Lipstick Side Effects: అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు రోజూ వివిధ రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను వాడుతుంటారు. అందులో లిప్‌స్టిక్ కూడా ఒకటి. ఎంత మేకప్ వేసుకున్నా పెదాలకు లిప్ స్టిక్ అప్లై చేస్తేనే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అకేషన్‌ తో పని లేకుండా రెగ్యులర్ గా లిప్‌స్టిక్ వేసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఎప్పుడో ఒకసారి లిప్‌స్టిక్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా తరుచుగా లిప్ స్టిక్ అప్లై చేయడం వల్ల పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. లిప్ స్టిక్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పెదాలు పొడిబారడం:
మార్కెట్లో లభించే లిప్‌స్టిక్ లల్లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల పెదాలు పొడిబారతాయి. రోజు లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల పెదాలు పగులుతాయి. అందుకే హానికరమైన కెమికల్స్ లేని లిప్‌స్టిక్ ఎంపిక చేసుకోవడం మంచిది.

- Advertisement -

రోజు లిప్ స్టిక్ పట్టుకునే మహిళల్లో పెదాలు పొడిబారడం, చికాకుకు గురయ్యే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన న్యూయార్క్ యూనివర్సిటీలో జరిగింది. లిప్‌స్టిక్ లోని పదార్థాలు పెదాల సహజ రక్షణను దెబ్బ తీస్తాయని ఆ కారణంగానే పెదాలు పొడిబారతాయని రుజువైంది.
అలర్జీలు:
ప్రతిరోజు లిప్ స్టిక్ పెదాలకు అప్లై చేసుకోవడం వల్ల కొంతమందిలో అలర్జీ, దురద, పెదాలు ఎర్రగా మారడం,వాపు వంటి సైడ్‌ ఎఫెక్ట్స్ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య సమస్యలు:
లిప్ స్టిక్ లో హానికారక లోహాలు, కెమికల్స్, పారాబెన్లు అధికంగా ఉంటాయి. లిప్‌స్టిక్ వాడటం వల్ల అందులోని కెమికల్స్ నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి రక్తంలో కలిసిపోతాయి. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతే కాకుండా ఈ రసాయనాలు రక్తంలో కలవడం వల్ల భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు కూడా ట్రాన్స్‌ఫర్ అవుతాయట. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 30 మంది అమ్మాయిలపై రీసెర్చ్ చేసి ఈ విషయాలను వెల్లడించారు.
ఇన్‌ఫెక్షన్లు:
లిప్ స్టిక్ లను శుభ్రంగా ఉంచుకోకపోతే బ్యాక్టీరియాలకు అవి నిలయంగా మారుతాయి. ఈ బ్యాక్టీరియా చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కాబట్టి లిప్ స్టిక్ వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే అప్లికేటర్ ను క్లీన్ గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే !

లిప్ స్టిక్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • లిప్‌స్టిక్ పెట్టుకొనే ముందు, తర్వాత పెదాలకు లిప్ బామ్ అప్లై చేయండి.
  • రసాయనాలు లేని లిప్ స్టిక్  ఎంపిక చేసుకోండి.
  • రాత్రి పడుకునే ముందు లిప్ స్టిక్  తొలగించండి.
  • గర్భిణీలు లిప్‌స్టిక్ వాడకుండా ఉండటం మంచిది.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News