Big Stories

Shocking Study Reports: ‘భారతీయులు సోమరిపోతులు’.. అధ్యయనంలో సంచలన విషయాలు

Shocking Study Reports: భారతదేశంలో దాదాపు 50 శాతం మంది సోమరిపోతులేనని ఒక నివేదిక వెల్లడించింది. కేవలం అవసరాన్ని బట్టి శారీరక వ్యాయామం చేస్తారని పేర్కొంది. స్త్రీల పరిస్థితి పురుషుల కంటే అధ్వాన్నంగా ఉందని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఆరేళ్లలో అంటే 2030 నాటికి 60 శాతం మంది భారతీయులు వివిధ వ్యాధుల బారిన పడతారని ఈ నివేదికలో హెచ్చరించింది. శారీరక వ్యాయామం, అంటే వ్యాయామం, రన్నింగ్, వాకింగ్ వంటి వాటిని చేయకుండా భారతీయులలో చాలా ఆరోగ్య ప్రమాదాలు పెరిగాయి. ఈ అధ్యయనంకు సంబంధించిన నివేదిక లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.

- Advertisement -

10 కోట్ల మంది డయాబెటిస్ పేషెంట్స్

- Advertisement -

Also Read: ఆడ పిల్లలకు చిన్న వయసులోనే పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి ? కారణాలు తెలుసా..

ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఇండియా డయాబెటిస్ స్టడీ ప్రకారం, 2021 నాటికి భారతదేశంలో దాదాపు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఇది మాత్రమే కాదు 2021 నాటికి 31 కోట్ల మందికి పైగా భారతీయులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ యొక్క నివేదిక ప్రకారం దక్షిణాసియాలో చాలా మంది వయసులో పెద్ద వారు వ్యాయామం మరియు శారీరక శ్రమ విషయంలో సోమరితనంతో వ్యవహరిస్తున్నారని తెలిపింది.

సోతమరితనంతో 57% మంది మహిళలు

భారతదేశంలో 57 శాతం మంది మహిళలు శారీరకంగా సోమరితనంతో ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. కాగా, ఇందులో వయసు మళ్లిన వారి సంఖ్య 42 శాతం ఉందని కూడా స్పష్టం చేసింది. అధిక ఆదాయాలు ఉన్న ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శారీరక శ్రమ లేకుండా ఉండే వారి జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని పరిశోధకుల బృందం చెబుతోంది. భారతదేశంలో 2000 సంవత్సరంలో 22 శాతం మంది శారీరకంగా తగినంత చురుకుగా లేరని వెల్లడించింది. 2010లో ఈ సంఖ్య 34 శాతం ఉండగా ఇప్పుడు 50 శాతానికి పెరిగింది. రానున్న ఆరేళ్లలో ఈ సంఖ్య 60 శాతానికి పెరగనుంది. ఎక్కువ కాలం శారీరక శ్రమ లేకుండా ఉండడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఈ నివేదిక చెబుతోంది. ప్రతి వారం కనీసం 150 నిమిషాలు నెమ్మదిగా లేదా 75 నిమిషాల పాటు తీవ్రమైన శారీరక శ్రమ చేయని ఎవరైనా శారీరకంగా సోమరిపోతులుగా పరిగణించబడతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News