EPAPER

Zucchini:- ఈ సమస్యలు ఉన్నవారు సొరకాయ తినకూడదు

Zucchini:- ఈ సమస్యలు ఉన్నవారు సొరకాయ తినకూడదు

Zucchini:- సొరకాయ ఇది మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తోంది. కొన్ని చోట్ల దీన్ని ఆనపకాయగా కూడా పిలుస్తుంటారు. సొరకాయతో చేసే స్వీట్‌ పెళ్లిళ్లకే హైలెట్‌గా నిలుస్తుంది. కూర అయినా ఇగురు అయినా ఆకరికి సాంబార్‌లో వేసినా దీని రుచే వేరు. చాలా రకాల వ్యాధులకు సౌరకాయ అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. సొరకాయ జ్యూస్‌ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్‌ కరిగిపోతాయి, అంతేకాకుండా టాక్సిన్లు కూడా శరీరం నుంచి బయటికి పోతాయి. మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. సొరకాయలో విటమిన్‌ బి, సి, పొటాషియం, జింక్‌, మెగ్నీషియం, కాల్షియం సంవృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌తో సహా దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. సొరకాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కొవ్వు అలాగే పైత్యాన్ని విసర్జించడంలో బాగా ఉపయోగపడతాయి. కాలేయ వ్యాధుల చికిత్సలో కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే మన శరీరంలోని అధిక వేడిని, పైల్స్, మలబద్ధకం, వేడి కురుపులను సొరకాయ పోగొడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఇందులో ఉండడంతో దీర్గకాలికంగా ఉన్న మలబద్ధకాన్ని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. రక్తంలో ఉండే చక్కెర, ట్రై గ్లిజరైడ్స్ మరియు ఇన్సులిన్ స్థాయిలను సొరకాయ తగ్గిస్తుంది. షుగర్‌ ఉన్నవారికి సొరకాయ ఒక వరం అని చెప్పవచ్చు. టాక్సిన్స్ తొలగించడంలో సొరకాయది ముఖ్యపాత్ర. మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను సమర్థవంతంగా సొరకాయ బయటికి పంపుతుంది. అయితే ఎన్నో పోషకాలు ఉన్నా కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు సొరకాయలు ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా ఒక మూడు వ్యాధులతో బాధపడేవారు సొరకాయని తింటే ప్రమాదం అంటున్నారు. జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా, బ్రోన్ కైటిస్ ఉన్నవారు సొరకాయ జ్యూస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


వైన్‌ తాగితే షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయా?


Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×