EPAPER

Wine For Diabetes : వైన్‌ తాగితే షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయా?

Wine For Diabetes : వైన్‌ తాగితే షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయా?
Wine For Diabetes

Wine For Diabetes : ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఓ మోతాదులో మద్యం తాగడం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే చెప్పారు కూడా. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే రోజూ మనం తీసుకునే ఆహారంతో పాటుగా కొద్దిపాటి మోతాదులో వైన్‌ తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయని అంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు.


అయితే టులేన్ యూనివ‌ర్సిటీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కళ్లు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సైంటిస్టులు దాదాపు 3 లక్షల మంది మందుతాగేవారి వివరాలు సేకరించారు.. వారి ఆహారం, మద్యం అలవాట్లపై అధ్యయనం చేశారు. అంతేకాకుండా వారి ఆరోగ్య వివరాలనూ అడిగి తెలుసుకున్నారు. ఇలా తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో రోజూ ఆహారంతో పాటు కొద్దిగా మద్యం తాగేవారిలో టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు దాదాపు 15శాతం తగ్గినట్టు తేలింది. అందుకే రోజూ కొద్దిగా మందు తాగుతూ ఆహారం తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే కొందరికి డౌట్లు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు మద్యం తీసుకోవచ్చా, క్యాలరీలు అధికంగా ఉంటాయి కదా అని అనుకుంటారు. అలాంటివారు వైన్‌ తీసుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే మిగతా మ‌ద్యం రకాలతో పోలిస్తే వైన్‌లో చాలా తక్కువగా క్యాలరీలు ఉంటాయి. అందుకే మధుమేహులు వైన్‌ను ఏ అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ప్రతరోజూ కాస్త మోతాదులో లేదా వారానికి రెండుసార్లు ఆహారంతో కలిపి తీసుకుంటేనే షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మోతాదుకు మించి మద్యం తీసుకుంటే మాత్రం ఎన్నో అనర్థాలు జరుగుతాయని, అందుకే మధుమేహ రోగులు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల వివరాలను ఓ డెయిలీలోప్రచురించారు. అంతేకాకుండా అమెరికన్‌ హార్ట్ అసోసియేష‌న్‌కు చెందిన ఎపిడెమియాల‌జీ, ప్రివెన్ష‌న్‌, లైఫ్‌స్టైల్‌ మరియు కార్డియో మెట‌బాలిక్ హెల్త్ కాన్ఫ‌రెన్స్ 2022లో కూడా చెప్పారు.


Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×