Big Stories

Pedicure At Home: పాదాల మెరుపు కోసం.. ఇంట్లోనే ఇలా పెడిక్యూర్ ట్రై చేయండి !

Pedicure At Home: అందం విషయంలో అమ్మాయిలు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అందంగా కనిపించడం కోసం చాలా మంది అనేక రకాల ఉత్పత్తులు, బాడీ లోషన్లు, ఫేస్ క్రీములు మొదలైనవి వాడుతుంటారు. అందంగా కనిపించాలంటే ముఖంతో పాటు చేతులు, కాళ్లు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే అందానికి పరిపూర్ణత చేకూరుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బయట తిరిగినప్పుడు మట్టి, బురద కారణంగా పాదాలు అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పాదాలు అందంగా కనిపిస్తాయి.

- Advertisement -

ప్రతి సారి పాదాలు అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లలేం. పైగా పార్లర్‌లో పెడిక్యూర్ అంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంటి దగ్గరే ఈ పేస్ట్ తో కొన్ని పదార్థాలు కలిపి పెడిక్యూర్ చేసుకుంటే పాదాలపై ఉండే టాన్ పోవడమే కాకుండా అందంగా, మృదువుగా కూడా తయారవుతాయి.

- Advertisement -

పెడిక్యూర్ కోసం కావాల్సినవి:
ముందుగా ఒక చిన్న పాత్రలో ఒక్క స్పూన్ టూత్ పేస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ బియ్యపు పిండి, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసి వీటిని మిక్స్ చేసి దాన్ని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా:
ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడానికి ముందుగా మీ కాలి గోళ్లకు ఏదైనా పాత నేర్ ఫాలిష్ ఉంటే రిమూవర్ సహాయంతో తొలగించుకోవాలి. అనంతరం గోళ్లను అనుకున్న రీతిలో కట్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకోండి. అందుకోసం గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి కొన్ని నిమిషాలు పాదాలను ఉంచాలి.

నీటిలో ఉప్పును చేర్చడం వల్ల పాదాల్లోని దుమ్మును ఇది దూరం చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తర్వాత ఫ్యూమిస్ స్టోన్ తీసుకుని మురికి వదిలేంత వరకు పాదాలపై స్క్రబ్ చేసుకోవాలి. పాదాలు క్లీన్ అయిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టూత్ పేస్ట్ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయాలి.

ఆ తర్వాత పాత టూత్ బ్రష్ తీసుకుని సుమారు అయిదు నిమిషాల పాటు స్క్రబ్ చేస్తూ ఆపై నీటితో కడిగేయాలి. ఆ తర్వాత మృదువైన టవల్ తీసుకుని కాళ్లను తుడుచుకుంటూ కాసేపు ఆరబెట్టాలి.

ఇలా చేయడం వల్ల పాదాల చుట్టూ పేరుకుపోయిన మృతకణాలు, తెల్లని పొర తొలగిపోయి మృదువుగా తయారవుతాయి. అలాగే టాన్ కూడా చాలా వరకు తగ్గుతుంది.

Also Read:  లిప్‌స్టిక్ వేసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు గ్యారంటీ !

వారానికోసారి ఈ విధంగా పెడిక్యూర్ చేస్తే పాదాలు క్లీన్ గా ఉండడంతో పాటు మృదువుగా, కోమలంగా కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల పాదాల చుట్టూ పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి మృదువుగా మారతాయి. టానింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. వారానికోసారి ఈ విధంగా పెడిక్యూర్ చేస్తే  రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి కాళ్లు మెరిసేలా చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News