Big Stories

Wifi Router: రాత్రివేళ Wi-Fiని ఆఫ్ చేయడం లేదా ? ఎంత ప్రమాదమో తెలుసా

Wifi Router: ప్రస్తుతం వైఫై అనేది లేని ఇళ్లే లేదు. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు అందరూ చాలా అభివృద్ధి చెందుతున్నారు. నగరాల నుంచి మొదలుకుని పల్లెటూర్ల వరకు వైఫై లేని ప్రాంతాలు లేకుండా పోయాయి. అడవుల్లో నివసించే వారి కోసం టెక్నాలజీని డెవలప్ చేసి ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకం వల్ల వైఫై వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. 24 గంటలు వైఫైని వాడడం, ఆన్ లైన్ లోనే ఉండడం అనేది చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో ఇంట్లో 365 రోజుల పాటు ప్రతీ రోజూ 24 గంటల పాటు వైఫైని ఆన్ లోనే ఉంచి వాడేస్తుంటారు. కనీసం ఒక్కసారి కూడా వైఫైని ఆఫ్ చేయకుండా ఎప్పటికీ ఆన్ లోనే ఉంచుతారు.

- Advertisement -

అయితే వైఫై రూటర్ ను ఇలా 24 గంటల పాటు ఆన్ లోనే ఉంచడం వల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చిరస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ కూడా వైఫై రూటర్ ను కూడా ఆన్ లో ఉంచడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ లు, ఫోన్ల కోసం 24 గంటల పాటు వైఫై ఆన్ లోనే ఉంచుతారు. అయితే వైఫై రూటర్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మెదడుపై ప్రభావం:

వైఫై రూటర్‌ను రాత్రివేళ ఆన్ లో ఉంచడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల నిద్రలేమి, అలసట, మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. ఈ మేరకు ‘జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ’లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో రూటర్ దగ్గర పడుకునే వారికి మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 40 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది.

అల్జీమర్స్:

రూటర్ రాత్రంతా ఆన్‌లో ఉంటే నరాల సమస్య, పునరుత్పత్తి, క్యాన్సర్ వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. వీటి కారణంగా అల్జీమర్స్ వంటి అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల రాత్రంతా వైఫై రూటర్ ను ఆన్ లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News