Big Stories

Monsoon Skin Care: వర్షాకాలంలో చర్మం తాజాగా ఉండటానికి చిట్కాలివే !

Monsoon Skin Care Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలా సరదాగా ఉంటుంది. వర్షంలో తడుస్తూ వెదర్ ఎంజాయ్ చేయడానికి అందరూ ఇష్టపడతారు. కానీ అలా వర్షంలో తడవటం చర్మానికి అంత మంచిది కాదు. రెయినీ సీజన్ లో చర్మం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఐతే రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో కూడా చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చు.

- Advertisement -

గాలిలో ఉండే తేమ, వర్షం వల్ల కలిగే తడి పరిస్థితులు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం స్థితిస్థాపకత కూడా తగ్గుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం వర్షాకాలంలో ప్రత్యేక చర్మ సంరక్షణ పద్ధతులను పాటించాలి. మన చర్మ స్వభావాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకునేలా జాగ్రత్తలు పాటించాలి. జుట్టు, చర్మానికి ఒకే విధమైన సంరక్షణ ఉండదు. ఎల్లప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ముఖ్యం. మాన్ సూన్ అనేది ఫేస్‌కే పరిమితం కాకుండా బాడీ స్కిన్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది.

- Advertisement -

వర్షాకాలంలో అధిక తేమ చర్మాన్ని త్వరగా జిడ్డుగా మారుస్తుంది. అంతేకాకుండా మొటిమలు రావడానికి కారణమవుతుంది. చెమట వల్ల శరీర దుర్వాసన కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర, దద్దుర్లు చర్మానికి హానికరం .అయితే అటువంటి పరిస్థితుల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సన్‌స్క్రీన్:
వర్షాకాలంలో సన్‌స్క్రీన్ వాడడం మర్చిపోకూడదు. అన్ని సీజన్‌లలో తప్పకుండా సన్‌స్క్రీన్ వాడాలి. బయటికి వెళ్లడానికి 20 నిమిషాల ముందు శరీరానికి సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. మీ శరీర తత్వానికి తగిన సన్‌స్క్రీన్ ఎంచుకోవడం ఉత్తమం. జిడ్డు చర్మం ఉన్నవారు దానికి తగిన సన్‌స్క్రీన్ ఉపయోగించడం మంచిది.
ఎక్స్ ఫోలియేషన్:
సున్నితమైన చర్మం ఉన్నవారు 10 రోజులకు ఒకసారి ఎక్స్ ఫోలియేషన్ చేయడం మంచిది. వీలైతే వారానికి ఒకసారి ఎక్స్ ఫోలియేషన్ చేయండి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలు, మురికిని తొలగించడంలో ఉపయోగపడుతుంది. ముఖం, చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మొటిమలు రాకుండా నివారిస్తుంది.
ఫేస్‌‌వాష్:
రోజుకు కనీసం రెండు సార్లు ఫేస్ వాష్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకోండి. చర్మం జిడ్డుగా మారితే ఎక్కువ సార్లు శుభ్రం చేయడం మంచిది. చర్మానికి తగిన ఫేస్‌వాష్‌ను ఎంచుకోవడం ఉత్తమం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫేస్ వాష్ ఉపయోగపడుతుంది. శరీరానికి సున్నితమైన టోనర్‌‌‌ను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
Also Read:టమోటా ఫేస్ ప్యాక్‌తో మెరిసే చర్మం మీ సొంతం.. ఇలా ట్రై చేయండి..!

మేకప్‌ జాగ్రత్తలు:
వర్షాకాలంలో అన్ని రకాల మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వర్షాకాలంలో కొన్ని రకాల మేకప్‌లను మాత్రమే వేసుకోవాలి. మీరు మస్కారా వంటి మేకప్ వేసుకోవాలి అనుకుంటే వాటర్‌ప్రూఫ్ మస్కరాలను ఎంచుకోండి. వర్షాకాలంలో ఆయిల్ మేకప్ వేయడం మానుకోండి. కెమికల్ మేకప్‌కు బదులుగా సహజమైన మేకప్‌ను వాడండి. మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించండి. వర్షాకాలంలో చర్మాన్ని తేమగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ముఖ్యం. ఇది చర్మంలో నూనె అధికంగా ఉత్పత్తి చేయడాన్ని నిరోధిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News