Big Stories

Masoor Dal Face Pack: ఎర్ర కందిపప్పు ఫేస్‌ప్యాక్.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది!

Masoor Dal Face Pack for Glowing Skin: ముఖం ఎప్పుడూ అందంగా ఉండడానికి మార్కెట్‌లో దొరికే క్రీములు ఫేస్‌వాష్‌లు చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ కాలుష్యం, దుమ్ము, చెమటతో పాటు అనేక కారణాల వల్ల ముఖం తరచుగా జిడ్డుగా మారడం, ఫేస్‌పై పింపుల్స్ వస్తాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం చాలామంది క్రీములు వాడటం లేదా పార్లర్లకు వెళ్లడం చేస్తుంటారు. అందం కోసం భారీగా ఖర్చు పెట్టేవారు లేకపోలేదు. ఎన్ని చేసినా పెద్దగా ఫలించడం కనిపించడం లేదని బాధపడేవారి కోసం ఓ చిట్కా.. అదే మసూర్ దాల్ ఫేస్‌ప్యాక్.

- Advertisement -

ఇంట్లోనే లభించే మసూర్ దాల్‌తో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎర్ర కందిపప్పులో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో ఫేస్ ప్యాక్ చేసుకుని ముఖంపై అప్లై చేస్తే చర్మం మెరిసి పోతుంది. మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ అద్భుతమైన టెక్సాస్ పోలేట్‌గా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ద్వారా ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి.. ముఖం కాంతివంతంగా మారుతుంది.

- Advertisement -

ఎర్ర కందిపప్పు..
ఎర్ర కందిపప్పు లేదా మసూర్ దాల్‌లో పోలియేటింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని అందంగా మార్చడంతో పాటు చర్మం తాజాగా ఉండడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేయడానికి ఉపయోగపడే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మసూర్ దాల్ లో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, తో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని లోతు నుంచి శుభ్రపరిచి మంచి పోషణ అందిస్తుంది.

Also Read: Hair Fall: విపరీతంగా జుట్టు ఊడిపోతుందా ? అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు:
మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డుతో పాటు మృతకణాలను తొలగించడంలో ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

టాన్ రిమూవల్:
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ మంచిటాన్ రిమూవర్‌లాగా పనిచేస్తుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు చర్మం రంగును మార్చడంతో పాటు చనిపోయిన చర్మ కణాలను తొలగించి స్కిన్ హెల్తీగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ముఖంపై ఉండే ట్యాన్‌ను తొలగించడంతో పాటు చర్మం యొక్క అసలు రంగును బయటకు తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది.

మెరిసే చర్మం:
ప్రకాశవంతమైన చర్మం కోసం మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. మసూర్ దాల్ సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా మొటిమలు, మచ్చలను నయం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది

Also Read: ఈ ఆహారాలు తింటున్నారా ? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ !

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ:
మసూర్ దాల్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఉపయోగపడతాయి. అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కూడా ఇవి సహాయపడతాయి. చర్మ వ్యాధులు, చికాకు,చర్మం ఎర్రబడటం వంటి సమస్యల నుంచి దూరం చేస్తాయి.

ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్ తయారీ:
మసూర్ దాల్ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి గుప్పెడు మసూర్ దాల్‌ను తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తాజా అలోవెరా జెల్‌ను కూడా తీసుకోండి. మసూర్ దాల్‌ను అరగంట పాటు ముందుగా నీళ్లలో నానబెట్టాలి. అనంతరం నీళ్లను తీసేసి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అలోవేరా జెల్‌ను అందులో కలిపి ఫేస్‌కి అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా కడగండి. అయితే ఈ మసూర్ దాల్ ఫేస్ ప్యాక్ చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు అందులో ఇది ఒకటి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News