Big Stories

Benefits of Multani Mitti Hair Pack: ముల్తానీ మట్టిని ఇలా ట్రై చేయండి.. ముఖంతోపాటు జుట్టు కూడా మెరిసిపోతుంది..!

Benefits of Multani Mitti Hair Packs: ముల్తానీ మట్టి స్పాషాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొటిమలు, జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్నవారు ఈ ముల్తానీ మట్టిని ఉపయోగిస్తుంటారు. ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల మొటిమలు, జిడ్డు చర్మం తగ్గి ఫేస్ అందంగా కనిపిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ టిప్ అందరికీ తెలిసిందే. అయితే, ముల్తానీ మట్టితో పలు రకాల హెయిర్ ప్యాక్ లు కూడా వేసుకోవొచ్చని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుందని, జట్టు ఒత్తుగా పెరుగుతందని సూచిస్తున్నారు. అంతేకాదు.. జుట్టుకి ఉన్న మురికి, చండ్రును వదిలేలా చేస్తుందని చెబుతున్నారు. జుట్టుకు కండిషనర్ లా పనిచేసి కురులను మృదువుగా, మెరిసేలా చేస్తుందంటున్నారు. అదేవిధంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ మట్టితో హెయిర్ ప్యాక్ ట్రై చేసి చూడండంటూ సూచిస్తున్నారు.

- Advertisement -

ముల్తానీ మట్టితో హెయిర్ ప్యాక్ చేసే విధానం..

Step – 1: ముందుగా ఒక గిన్నెలో ముల్తానీ మట్టిని, బియ్యపు పిండిని సమాన భాగాలుగా తీసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక కప్పు పెరుగు, ఒక గుడ్డులోని తెల్లటి సొనను మాత్రమే కలపాలి. ఆ మొత్తాన్ని మెత్తగా పేస్టులా చేయాలి. దీనిని మాడు నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. ఒక అరగంటసేపు అలానే ఉండాలి. ఆ తరువాత కెమికల్స్ లేని షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా హెయిర్ ప్యాక్ చేయడం వల్ల జుట్టుకు ఉన్న మురికి, చుండ్రు మటుమాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Face Pack: గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం.. మసూర్ దాల్‌ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి !

Step – 2: ఒక గిన్నెలో జుట్టుకు సరిపోయేంతగా ముల్తానీ మట్టిని తీసుకోవాలి. అందులో 2 చెంచాల నిమ్మరసాన్ని కలపాలి. మరో చెంచా పెరుగును కూడా చేర్చాలి. అనంతరం ఆ మొత్తాన్ని పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు అలాగే ఉండి, ఆ తరువాత తలస్నానం చేయాలి.

ఆ సమయంలో రసాయనాలు లేని షాంపుతో మాత్రమే తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు కురులు నిగనిగలాడతాయి. అంతేకాదు.. ముల్తానీ మట్టి చుండ్రు సమస్యను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందంటూ పరిశోధకులు కూడా చెప్పిన విషయం తెలిసిందే.

Step – 3: ఓ కప్పులో ముల్తానీ మట్టిని తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి పేస్ట్ లా చేయాలి. అందులో గుడ్డులోని తెల్లటిసొనను, ఓ కప్పు నువ్వుల నూనెను చేర్చాలి. ఆ తరువాత దానిని బాగా కలిపి తలకు పట్టించాలి. సుమారుగా 30 నిమిషాలపాటు ఆరిన తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారుతుందని చెబుతున్నారు.

Also Read: వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే ఇన్ఫెక్షన్లకు గుడ్ బై చెప్పొచ్చు !

మరో స్టెప్ ఏంటంటే..

ముల్తానీ మట్టికి కప్పు గులాబీనీళ్లతో మిక్స్ చేసి ఆ పేస్ట్ ను తలకు ప్యాక్ లా చేసుకోవాలి. ఇలా తరచుగా ప్యాక్ చేసుకోవడం వల్ల చుండ్రుకు కారణమయ్యే జిడ్డూ, దుమ్మూ, దూళిని ముల్తానీ మట్టి గ్రహిస్తుంది. ఆపై బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుని మాడుకి రక్తప్రసరణా మెరుగుగా అందిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. మాడుపై పీహెచ్ శాతాన్ని సైతం సమన్వయం చేయడంలోనూ ముల్తానీ మట్టి సహాయపడుతందని చెబుతున్నారు.

Note: వైద్య, ఆరోగ్య నిపుణులు, పరిశోధకుల ప్రకారమే మేం ఇక్కడ మీకు సమాచారం, సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు మీరు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యులు, నిపుణుల సలహాలు తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News