Big Stories

Makeup Tips: మీ స్కిన్ టోన్‌కు ఏ లిప్‌స్టిక్ షేడ్ సెట్ అవుతుందో చూసేయండి !

Makeup Tips: అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా లిప్‌స్టిక్ తప్పనిసరిగా వాడుతుంటారు. లిప్‌స్టిక్‌‌తో తమ ఫేస్ మరింత అందంగా కనిపిస్తుందని దాని చాలా మంది ఫీలింగ్. అందుకే అమ్మాయిల మేకప్ బాక్స్‌లో కచ్చితంగా లిప్‌స్టిక్ ఉంటుంది. అయితే కొందరు మాత్రం తరుచుగా పింక్ లిప్‌‌స్టిక్ వాడుతుంటారు. చాలా మంది ఆడవారికి పింక్ కలర్ లిప్‌స్టిక్ అంటే ఇష్టం ఉంటుంది. ఇది ఆడవారి అందాన్ని మరింత పెంచుతుంది కూడా.

- Advertisement -

ప్రస్తుతం అనేక లిప్‌స్టిక్ షేడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామంది అమ్మాయిలు అందంగా కనిపించాలనే ఆరాటంతోనో లేక కొన్నిసార్లు మ్యాచింగ్ ఉందని పింక్ షేడ్స్‌ను ఉపయోగిస్తుంటారు. మీరు అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలంటే మీ స్కిన్ టోన్ తగిన లిప్‌స్టిక్ షేడ్స్ ఎలా వాడాలి. ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వారు ఏ రంగు లిప్‌స్టిక్ వాడాలి ? ఛామన చాయలో ఉండే చర్మానికి ఎలాంటి లిప్‌స్టిక్ వేసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఫెయిర్ స్కిన్ టోన్ :
స్కిన్ కలర్ ఫేర్‌గా ఉండే అమ్మాయిలు అన్ని రకాల లిప్‌స్టిక్ షేడ్లను ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు పింక్ కలర్ లిప్‌స్టిక్ షేడ్‌ మిస్ అవుతుంటారు. కానీ అందమైన లుక్ మీ సొంతం కావాలంటే పింక్ లిప్ స్టిక్ ఉపయోగించాలి. దీని వల్ల మీ స్కిన్ టోన్ మరింత అందంగా కనిపిస్తుంది.
డార్క్ స్కిన్ టోన్:
ఒకవేళ మీ స్కిన్ డార్క్ కలర్‌లో ఉంటే పింక్ కలర్‌లో ఉండే ప్రతీ లిప్‌ షేడ్స్ మీకు బాగా సూటవుతుంది. డార్క్ కలర్ స్కిన్ ఉంటే కాండీ ఫ్లోస్ పింక్ లేదా మావ్ పింక్ షెడ్స్ ట్రై చేయండి.
లైట్ పింక్ వాడొద్దు:
స్కిన్ టోన్ డార్క్ గా ఉంటే అలాంటి వారు ముఖం మరింత అందంగా కనిపించాలనుకుంటే డార్క్ పింక్ లిప్‌స్టిక్ వాడండి. కానీ లైట్‌గా ఉండే పింక్ షేడ్స్ మాత్రం అస్సలు ఉపయోగించకండి.
బ్యుటీషియన్లు ఏం చెబుతున్నారంటే:
స్కిన్ టోన్‌కు తగ్గట్టు లిప్‌స్టిక్ ఎంచుకోవాలి. వైట్‌గా ఉండే వారు ఆరెంజ్, బ్రౌన్ కలర్‌లో ఉండే లిప్‌స్టిక్ లను ఎంచుకోవాలి. ఛామనచాయ రంగులో ఉండేవారు. లైట్ బ్రౌన్ లిప్‌స్టిక్ వేసుకోవాలి. అలాగే లైట్ జరీ రంగు లిప్‌స్టిక్ కూడా వేసుకోవచ్చు.

Also Read: ప్రతీ రోజూ వాల్​నట్స్​ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

లిప్‌స్టిక్ ఆరు నెలల తర్వాత వాడొద్దు:
ఏ లిప్‌స్టిక్ అయినా ఆరు నెలల తర్వాత అస్సలు ఉపయోగించకూడదు. లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత పెదాలతో సరిచేయడం వంటివి చేయకూడదు. ముందుగా పెన్సిల్ తో ఔట్ లైన్ వేసుకుని ఆ తర్వాతే లిప్‌స్టిక్ వేసుకోవాలి. లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెదాలకు వ్యాస్‌లెన్ వ్రాస్తే మరింత అందంగా కనిపిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News