Big Stories

Kasturi Haldi: కస్తూరి పసుపుతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా ?

Kasturi Haldi: అందంగా కనిపించడం కోసం ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో క్రీములు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే అలాంటి ఉత్పత్తులకు బదులుగా చర్మ సౌందర్యం కోసం కస్తూరి పసుపును వాడాలి. కస్తూరి పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చర్మ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కస్తూరి పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
మచ్చలు దూరం:
కస్తూరి పసుపు ఫేస్ ప్యాక్‌ తయారీలో వాడడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. కస్తూరి పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించడంతో పాటు ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.
చర్మ సమస్యలు:
యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న కస్తూరి పసుపు చర్మంపై ఉన్న ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. చర్మం యొక్క రంగును కూడా మారుస్తుంది. అంతే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది ఎంత గానో ఉపయోగపడుతుంది
అవాంఛిత రోమాలు:
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అన్ వాంటెడ్ హెయిర్ కూడా ఒకటి. వీటిని దూరం చేసేందుకు కస్తూరి పసుపు బాగా పనిచేస్తుంది. కస్తూరి పసుపులో శనగపిండి, పాలు కలిపి ప్యాక్‌లా చేసి ముఖానికి అప్లై చేసి అనంతరం క్లీన్ చేసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి దూరంగా ఉండొచ్చు.

- Advertisement -

Also Read: జుట్టు ఎక్కువగా రాలుతుందా.. ఈ నూనె రాస్తే.. మీ జుట్టు వద్దన్నాపెరుగుతుంది

- Advertisement -

కాంతి వంతంగా:
ముఖం కాంతివంతంగా మెరవాలని అందరూ కోరుకుంటారు. అలాంటి వారు ముఖానికి కస్తూరి పసుపుని వాడితే గ్లో పెరుగుతుంది. అంతే కాకుండా డార్క్ స్కిన్ ప్రాబ్లమ్ కూడా దూరమవుతుంది. కస్తూరి పసుపుని రెగ్యులర్‌గా వాడడం వల్ల మంచి ఫలితాలుంటాయి. పొల్యూషన్ వల్ల కలిగే స్కిన్ డ్యామేజ్‌ను కూడా ఇది దూరం చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News