Big Stories

Weight Loss Injection: బరువు తగ్గించే ఇంజెక్షన్ తీసుకోవడం.. ఆరోగ్యానికి మంచిదేనా?

Weight Loss Injection: ఒబేసిటి.. అదే ఊబకాయం.. ప్రస్తుతం మనందరిని తెగ ఇబ్బంది పెడుతున్న సమస్య. ఊబకాయమే ఓ సమస్య అంటే.. దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల లిస్ట్‌ చాంతాడంతా ఉంటుంది. గుండె జబ్బుల నుంచి మొదలు పెడితే.. బాడీలోని అన్ని పార్ట్స్‌ డ్యామేజ్‌కు అంతో ఇంతో సహకారం అందిస్తుంది ఒబేసిటీ.. ఈ విషయం తెలుసుకొని మనం బరువు తగ్గేందుకు చేసే ఫీట్స్ అన్నీ ఇన్నీ కావు. కానీ ఇకపై ఆ టెన్షన్ వద్దు. మా మందులు వాడండి. బరువును అలా తగ్గించేసుకోండి అంటోంటి అమెరికన్‌ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ.. ఇంతకీ ఈ కంపెనీ తీసుకొచ్చే ఆ మందేంటి? దాని కథేంటి? ఆ మందులు వాడటం మనకు మంచిదేనా? లేక కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమేనా?

- Advertisement -

పార్క్‌లకు వెళ్లి పరుగులు తీస్తూ కొందరు. జీమ్‌లలో చెమటలు కక్కుతూ మరికొందరు. నచ్చింది తినలేక నోరును కుట్టేసుకుంటూ కష్టపడేది మరికొందరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అదిగో ఇలాంటి వారందరికి గుడ్ న్యూస్ చెబుతున్నాం. ఇకపై మీ బరువును ఇట్టే తగ్గిస్తామని చెబుతోంది అమెరికన్ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ. తమ మందులు వాడండి బరువును ఇట్టే తగ్గించేసుకోండి అంటూ ఆఫర్‌ ఇచ్చేస్తుంది. ఇప్పటికే భారత్‌తో చర్చలు జరిపేశాం.. ఇక ఇండియాలో లాంచ్‌ చేయడమే ఆలస్యమన్నట్టు ప్రకటనలు కూడా ఇస్తోంది. మరి ఇది నిజమేనా అంటే.. కరెక్ట్‌గా చెప్పలేం కానీ. ఎలీ లిల్లీ ఫార్మా కంపెనీ ఇప్పటికే అమెరికాలో అయితే ఈ డ్రగ్స్‌ను సేల్ చేస్తోంది.

- Advertisement -

ఎలీ లిల్లీ అమెరికాలో రెండు రకాల మందులను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో మౌంజర్ అనే డ్రగ్‌ను, మరొకటి డయాబెటిస్‌ కోసం.. ఇక జెప్‌పౌండ్ అనే డ్రగ్‌ను వెయిట్ లాస్‌ కోసం లాంచ్ చేసింది. ఇవీ రెండు కూడా అమెరికాలో సక్సెస్ అయ్యాయి.అయితే ఈ రెండింటిలో ఉండే ఇంగ్రిడియెంట్‌ టిర్జ్‌పటైడ్.. ఇందులో మౌంజర్ ఏకంగా 5 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను దక్కించుకుంది. నిజానికి అమెరికాలో 70 శాతం మంది అడల్ట్స్ ఓబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఓవర్ వెయిట్.. లేదా వాటి వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి అప్రూవల్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత యూకే, యూరప్‌లో కూడా ఈ డ్రగ్‌కు అప్రూవల్ వచ్చింది. దీంతో అక్కడ కూడా సేల్స్ పెరిగాయి.

ఇప్పుడు ఎలీ లిల్లీ ఫోకస్ ఇండియాపై పడింది. ఇండియాలో కూడా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాటు ఓబెసిటీ కేసులు పెరుగుతున్నాయి. 2021లో లక్షా 40 వేల కోట్లుగా ఉన్న డయాబెటిస్ మార్కెట్.. 2031 వరకు నాలుగు లక్షల 85 వేల కోట్ల వరకు పెరుగుతుందన్నది ఓ అంచనా.. అందుకే ఇండియాలో కూడా తమ మార్కెట్‌ను తెరిచేందుకు రెడీ అయ్యింది ఎలీ లిల్లీ.. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లో రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకుంది. కానీ ఇంకా ఫైనల్ అప్రూవల్ రాలేదు. అయితే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ డయాబెటిస్‌కు సంబంధించిన డ్రగ్ మౌంజరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఫైనల్ అప్రూవల్‌ కూడా వచ్చే చాన్సుంది. అయితే SEC వెయిట్‌ లాస్‌ డ్రగ్ జెప్‌పౌండ్‌కు ఓకే చెప్పలేదు.

Also Read: రాత్రిపూట ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే అస్సలు లైట్ తీసుకోకండి..

2025 వరకు తమ మందులు ఇండియన్‌ మార్కెట్‌లో ఉంటాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎలీ లిల్లీ ప్రతినిధులు.. అయితే వెయిట్ లాస్‌కు ఉపయోగపడే తమ మందులను మార్కెట్‌లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తోంది ఎలీ లిల్లీ.. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణల్లో భారతీయులపై ట్రయల్స్ స్టార్ట్ చేశారు. వీటి నుంచి ఫలితాలను చూసిన తర్వాతే టిర్జ్‌పటైడ్ వయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక వెయిట్‌లాస్‌కు సంబంధించి స్టేజ్‌ ఫోర్‌ ట్రయల్స్‌ కూడా కంటిన్యూ అవుతున్నాయి.

అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇలా ఇంజెక్షన్స్‌, మందులు వాడి బరువు తగ్గడం ఎంత వరకు కరెక్ట్.. ? ఇలా మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ రావా? అంటే ఇప్పుడే సమాధానం చెప్పలేం. ఎందుకంటే మెడిసిన్‌ అంటేనే మన ఇమ్యూనిటీపై ఎఫెక్ట్ చూపించేవి. మరి అలాంటి మందులు మంచి చేస్తాయా? అంటే ధైర్యంగా, నమ్మకంగా ఔను అని చెప్పలేం.. చూద్దాం.. మరి ఈ డ్రగ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News