Big Stories

Thyroid Symptoms: మీ పాదాలలో ఈ 3 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే థైరాయిడ్ పెరిగనట్లే

Thyroid Symptoms: థైరాయిడ్ అనేది ఈ రోజుల్లో చాలా తరచుగా కనిపించే ఒక సాధారణ వ్యాధి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. థైరాయిడ్ గ్రంధి మెడలో ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు, శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు థైరాయిడ్ అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని కాళ్ళకు సంబంధించి ఉంటాయి. అందులో ముఖ్యంగా తరచుగా పాదాలలో కనిపించే 3 లక్షణాలు థైరాయిడ్ అని చెప్పవచ్చు.

- Advertisement -

థైరాయిడ్ పెరిగినప్పుడు పాదాలలో కనిపించే 3 సంకేతాలు

- Advertisement -

1. పాదాలలో వాపు

థైరాయిడ్ పెరుగుదల కారణంగా పాదాలు, చీల మండల వాపు సంభవించవచ్చు. ఈ వాపు ముఖ్యంగా వేళల్లో తీవ్రంగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లు శరీరంలో నీటి సమతుల్యతను కాపాడతాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు, శరీరంలో అదనపు నీరు చేరుతుంది. దీని వలన కాళ్ళలో వాపు వస్తుంది.

2. పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరి

థైరాయిడ్ పెరుగుదల కారణంగా కాళ్లలో జలదరింపు లేదా తిమ్మిరి వస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు నరాలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల జలదరింపు లేదా తిమ్మిరి ఏర్పడుతుంది.

3. కాళ్ళలో నొప్పి

థైరాయిడ్ పెరగడం వల్ల కాళ్లలో నొప్పి కూడా రావచ్చు. ఈ నొప్పి తక్కువగానే ఉంటుంది. ఇది కాళ్ళలోని ఏదైనా భాగంలో అయినా రావచ్చు. థైరాయిడ్ హార్మోన్లు కండరాలు, కీళ్లను ప్రభావితం చేస్తాయి. నొప్పిని కలిగిస్తాయి. థైరాయిడ్ పెరగడమే కాకుండా, ఈ లక్షణాలు అనేక ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి. అందువల్ల, అటువంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

థైరాయిడ్ ఇతర లక్షణాలు

అలసట
బరువు తగ్గడం లేదా పెరగడం
జుట్టు రాలడం
చర్మం పొడిబారడం
పీరియడ్స్ సరిగా రాకపోవడం
చిరాకు
నిద్రకు ఇబ్బంది
గుండె దడ
ఆకలిలో మార్పు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News