Big Stories

Neem Leaves : వేప ఆకులతో వంద‌ల రోగాలు న‌యం


Neem Leaves : వేప చెట్టు.. ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మొక్కగా చెప్పవచ్చు. వేప చెట్టు నీడ చల్లగా ఉండటమే కాకుండా ఆ చెట్టు గాలి తగిలితే మనకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. వేప చెట్టులో ప్రతి భాగం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. వేప చేదుగా ఉంటుందని చాలామంది దీన్ని ఉపయోగించేందుకు ఇష్టపడరు.

- Advertisement -

కానీ రెండు వేపాకులను ప్రతిరోజు ఉదయం తినడం వల్ల మన శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు కలుగుతాయి. మన పూర్వీకులు కొన్ని వందల ఏళ్ల నుంచి వేప చెట్టును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులు చేదుగా ఉన్నా వాత లక్షణాలను క్రమబద్ధీకరించే శక్తి ఉంటుంది. మన రక్తంలో ఉండే వ్యర్ధపదార్థాలను తొలగించే గుణం వేపకు ఉంది. శరీరం నుండి ప్రీ రాడిక‌ల్స్‌ను తొలగించే ప్రక్రియను ఈ వేపాకులు వేగవంతం చేస్తాయి.

- Advertisement -

వేప ఆకులను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. శరీరంలో వచ్చే వాపులు, చర్మసంబంధిత సమస్యలు, జ్వరాలు, దంత సమస్యలు..ఇలా ఎన్నో రకాల సమస్యలను ఈ వేప నయం చేస్తుంది. పాతకాలంలో ఫ్లూ లాంటి సమస్యలతో బాధపడే వారికి వేపాకులను వారి దగ్గర ఉంచేవారు. అలాగే ఇంటికి తోరణాలుగా కూడా వేపాకులను కడతారు. వేప ఆకులను ఇంటికి కట్టుకోవడం వల్ల ఇంట్లోకి వచ్చే గాలి స్వచ్ఛంగా మారుతుంది.

అంతేకాకుండా క్రిమి కీటకాలు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ప్రతిరోజు రెండు లేత వేపాకులను నమిలి తింటే టైప్-2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణం వేపాకులకు ఉంది. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే ఈ వేపాకులను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పొట్టలోని క్రిములు, నులిపురుగులు చనిపోతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. మన పొట్ట, పేగులు కూడా శుభ్రమవుతాయి. వేపాకులను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. అలాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ వేపాకుల తినడం వల్ల రక్తం ఫిల్టర్ అవుతుంది.

వేపాకుల్లో పసుపు కలిపి రుబ్బుకొని చర్మంపై రాసుకుంటే ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే తగ్గిపోతాయి. అలాగే వేపాకులను పేస్ట్‌గా చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు దృఢంగా మారుతుంది. అంతేకాకుండా కంటి చూపు, దంతాలకు వేప చాలా మంచిది. నోటి దుర్వాసనను కూడా ఇది పోగొడుతుంది. వేప నూనెను రాసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఇంట్లో వేపతో పొగ వేయడం వల్ల క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News