Big Stories

Glowing Skin Tips: ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్.. బ్యూటీ పార్లర్ తో పని లేకుండా ముఖం మిలమిలా మెరిసిపోతుంది..!

How To Prepare Gold Facial At Home Step by Step: ముఖం కాంతివంతంగా ఉండేందుకు  రకరకాల ఫేసియల్ క్రీములు వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలు వేలు ఖర్చు చేసీ అందం కోసం రకరకాల ఫేసియల్ చేపించుకుంటారు. అందులో ముఖ్యంగా గోల్డ్ ఫేసియల్ చాలా మంది ఇష్టపడుతుంటారు. ఏదైనా పార్టీకి, పంక్షన్స్ కి వెళ్లాలంటే ముఖం మెరుపు కోసం గోల్డ్ ఫేసియల్ చేపించుకోవడం చేస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మానికి హానికలిగే అవకాశం ఉంది. వీటిలో ఉండే రసాయనాల వల్ల చర్మం పొడిబారిపోవడం, అనేక సమస్యలు వస్తాయి. ఇక నుంచి గోల్డ్ ఫేసియల్ చేసుకోవాలంటే మన ఇంట్లోనే దొరికే నేచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగించి ఈ ఫేసియల్ తయారు చేసుకోవచ్చు. అయితే గోల్జ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో, ఏ ఏపదార్ధాలు కావాలో వాటి వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందా.

- Advertisement -

ఇంట్లోనే గోల్డ్ ఫేసియల్ ఎలా తయారు చేసుకోవాలంటే..

- Advertisement -

గోల్డ్ ఫేసియల్ కోసం ముందుగా ఫేస్‌ని శుభ్రం చేసుకోవాలి. దీని కోసం ఒక గిన్నెలో పాలు తీసుకొని దూది సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము వంటివి మలినాలు తొలగిపోతాయి. ఆ తరువాత ఒక గిన్నెలో కాఫీపొడి, తేనె, నిమ్మరసం కలిపి వాటిని బాగా మిక్స్ చేసి 15 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా ముఖంపై బ్లాక్ హెడ్స్, టాన్ వంటివి తొలగిపోయి ముఖం మెరుస్తుంది.

అలాగే ఆవిరి పట్టడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఫేషియల్ స్టీమర్ ఉంటే ముఖం ఆవిరిపట్టడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం ద్వారా ముఖ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఒకవేళ స్టీమర్ లేకపోతే.. ఈ ఫేస్ ప్యాక్ ని ఉపయోగించండి. దీని కోసం ఒక గిన్నెలో పెరుగు, చిటికెడు పసుపు, కొబ్బరి నూనె లేదా తేనె కలపవచ్చు. వీటిని బాగా కలిపి ముఖంపై అప్లై చేయండి. ఇలా 15-20ల పాటు ఉంచి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చివరగా ఫేస్ పై మాయిశ్చరైజర్ వంటివి ఏదైనా రాస్తే చర్మం తేమగా ఉండి మెరుస్తుంది. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Also Read: మగవారి అందాన్ని పెంచే నేచురల్ ఫేస్ ప్యాక్స్ ఇవే..

గోల్డ్ ఫేసియల్ చేయడం వలన మఖంపై బ్లాక్ హెడ్స్, టానింగ్ వంటివి తొలగిపోతాయి. మొటిమలు నుంచి ఉపశమనం పొందవచ్చు. అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి.

గమనిక.. ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలన్ని మీకు అందిచబడింది. ఒకసారి ప్రయత్నించే ముందు నిపుణుల సలహాలను తీసుకోవాల్సిందిగా మనవి..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News