Big Stories

Homemade Face Cleansers: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఈ నాచురల్ క్లెన్సర్స్ ట్రై చేయండి

Homemade Face Cleansers: చర్మం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా ఉండటం ఎంతో అవసరం. స్కిన్ కేర్ రొటీన్‌లో క్లీనింగ్ కు చాలా ప్రాముఖ్యత ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సింది మీది ఎలాంటి స్కిన్ ఎలాంటిదో తెలుసుకోవడం. చర్మం రకం తెలిసినప్పుడు మాత్రమే క్లీనింగ్ అనేది సరిగ్గా జరుగుతుంది. చాలామంది మహిళలు, పురుషులకు వారి చర్మ రకాల గురించి కనీస అవగాహన కూడా కలిగి ఉండటం లేదట. ఈ కారణంగానే చర్మ రక్షణ విషయంలో వారు మెరుగైన ఫలితాలను పొందలేకపోతున్నారు.

- Advertisement -

అందరికీ ఒకేలా ఉండదు:

- Advertisement -

అందరి చర్మం ఒకేలా ఉండదు. ఒక్కో వ్యక్తి చర్మం ఒక్కో రకంగా ఉంటుంది. చర్మ రకాన్ని బట్టి మీ స్కిన్ కేర్ రొటీన్ ప్లాన్ చేసుకోవడం మంచిది. కొందరు జిడ్డు చర్మం ఉన్నవారు ఉంటారు. మరికొందరికి పొడి చర్మం ఉంటుంది. అయితే ఇలా వేర్వేరు రకాల చర్మాలు కలిగి ఉన్న వారు క్లీనింగ్ కూడా వేర్వేరు పదార్థాలతో ప్రత్యేకమైన పద్ధతుల్లో చేయాలి. ఫలితంగా, ఆరోగ్యమైన చర్మాన్ని పొందవచ్చు.

జిడ్డు చర్మం:
జిడ్డు చర్మం ఉన్నవారు చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి ముల్తానీ మట్టి చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. రెండు స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకొని అందులో చిటికెడు కర్పూరం పొడిని వేసి, కాస్త నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ మిశ్రమంతో మీ చర్మాన్ని చక్కగా మర్దన చేసుకోవాలి. పావు గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మీ స్కిన్ పూర్తిగా క్లీన్ అయిపోతుంది.
కాంబినేషన్ స్కిన్ :
చర్మం కాస్త పొడిగా, కాస్త జిడ్డుగా ఉన్నట్లయితే దీన్ని కాంబినేషన్ స్కిన్ గా పిలుస్తారు. ఇలాంటి చర్మం ఉన్నవారు చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి మెత్తని బొప్పాయిని తీసుకుని పేస్ట్ లాగా చేసి అందులో ఓట్ మీల్ పాలు కలిపి ముఖం, మెడ అంతా రుద్దాలి. ఇది చర్మానికి శక్తివంతమైన క్లెన్సర్ గా పనిచేస్తుంది. అంతే కాకుండా చర్మంపై ఉన్న నల్లని మచ్చలు పోవడానికి ఉపయోగపడుతుంది.
స్కిన్ క్లీనింగ్‌కు ఉపయోగపడే పదార్థాలు:
పెరుగు:
స్కిన్ క్లీనింగ్‌కు పెరుగు చక్కటి మెడిసిన్ లాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు రెండు టీస్పూన్ల పెరుగుతో చర్మాన్ని మసాజ్ చేసుకుంటూ కడిగేయండి. ఇది చర్మ రక్షణకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పీహెచ్ స్థాయిని కాపాడుతుంది.
స్ట్రాబెరీ గుజ్జు:
అన్ని రకాల చర్మ స్వభావాలకు స్ట్రాబెర్రీ గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది. 3 లేదా 4 స్ట్రాబెరీలను తీసుకొని వాటిని పేస్ట్ లా చేసి చర్మంపై అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఇది మంచి క్లెన్సర్‌గానే కాకుండా చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మ సౌందర్యానికి ఉపయోగపడే విటమిన్ సి కూడా  అందిస్తుంది.
టమాటాలు:
అన్ని రకాల చర్మ స్వభావం ఉన్న వారు టమాటాలు ఉపయోగించడం మంచిది. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికి, ధూళిని తొలగించడమే కాకుండా చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, రంధ్రాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక టమాటా ముక్కను తీసుకుని చర్మానికి చక్కగా రుద్ది పావుగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం మీరే చూడవచ్చు.

Also Read: బట్టతల రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

శనగపిండి:
ఇప్పుడు రకరకాల క్రీములను ఉపయోగిస్తున్నారు. కానీ పెద్దవాళ్లు చర్మాన్ని కాపాడుకోవడం కోసం చాలా కాలంగా శనగపిండిని ఉపయోగిస్తున్నారు. శనగపిండి అన్ని రకాల చర్మ స్వభావం ఉన్నవారికి ఉపయోగపడుతుంది. శనగ పిండిలో పెరుగు లేదా పాలను కలిపి చర్మానికి చక్కగా మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం మృదువుగా మెరిసేలా తయారు చేస్తుంది

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News