Big Stories

Natural Skin Care Tips: మెరిసే ముఖం కోసం కొన్ని చిట్కాలు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Homemade Beauty Tips for Face And Skin: ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు అందంగా ఉండాలని.. చర్మ సమస్యలు తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. బయట దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ లో వివిధ రకాల కెమిల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి ఒక్కొక్కసారి హానికలగవచ్చు. ఇలా కాకుండా ఉంటాలంటే మన ఇంట్లో దొరికే సహజ ఉత్పత్తులతోనే మన చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అదెలానో చూసేద్దాం..

- Advertisement -

ముఖం మీద మచ్చలు తొలగించడానికి

- Advertisement -

కాఫీపొడిలో ఒక స్పూన్ శెనగపిండి, ఒక స్పూన్ తేనె, చిటెకెడు పసుపు, కొంచెం పెరుగు వేసి వాటిని బాగ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10- 15 నిముషాలు ఉంచి ఆతర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి శుభ్రం చేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది.

ముఖం మెరుపు కోసం
ఒక గిన్నెలో పాలు తీసుకొని ఒక స్పూన్ నిమ్మరసం. కొంచె తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొంచెం సేపటి తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఒక చిన్న టమోటోతో ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. ఇవి చర్మం మెరిసేలా చేస్తుంది. ముఖం పై మురికిని, బ్లాక్ హెడ్స్ ని తొలగిస్తుంది.

Also Read: తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావొచ్చు..

చర్మ సమస్యలకు దూరంగా ఉండాలంటే..

స్నానం చేసే నీటిలో కొంచెం పటిక వేసి ఒక ఐదు నిముషాలు అలానే ఉంచి.. ఆతర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి. పటికలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అలాగే స్నానం చేసే ముందు నీటిలో వేప ఆకులను కూడా ఉపయోగించవచ్చు. వీటి వల్ల అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి.

బంగాళదుంప మాస్క్
పొటాటోలో బ్లీచింగ్ పదార్థాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఫెయిర్ స్కిన్ అందించడంలో తోడ్పడతాయి. బంగాళదుంపను మెత్తగా చేసి ఆ రసాన్ని ముఖంపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి ముఖంపై మురికిని తొలగించడంలో సహాయపడతాయి.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News