Big Stories

Cigarette Effect on Body: రోజుకో సిగరెట్.. మీ ప్రాణానికి ముప్పు అని తెలుసా..?

Smoking Health Effects: సిగరెట్ తాగడం మంచిది కాదని అందరికి తెలుసు. అయినా కూడా సిగరెట్ తాగకుండా ఒక్క రోజు కూడా ఉండని వారు చాలా మంది ఉన్నారు. రోజుకు ఒక సిగరెట్ తాగితే ఏమవుతుందిలే అంటూ అదే అలవాటును కొనసాగిస్తున్నారు. ఒక్క సిగరెట్ పీల్చినా చాలు మీ శరీరంపై ఎంతో ప్రభావం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఒక్క సారి సిగరెట్ పొగ పీల్చితే మీ శరీరాన్ని అది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. సిగరెట్ తాగిన వెంటనే మీ శరీరంలో స్వల్పకాలికంగా కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి.

- Advertisement -

సిగరెట్ నుంచి పొగ పీల్చిన వెంటనే అది నేరుగా శ్వాస వ్యవస్థకు చేరుతుంది. అక్కడ నుంచి ఇబ్బందులను సృష్టిస్తుంది. సిగరెట్ లో ఉండే విషపూరితమైన రసాయనాలు శ్వాస వ్యవస్థ గోడలకు ఇబ్బంది కలిగిస్తాయి. అంతేకాకుండా కుచించుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. సిగరెట్ తాగినప్పుడు దాని నుంచి వచ్చే హానికరమైన పదార్థాలను శరీరం బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో దగ్గు ప్రారంభమవుతుంది.

- Advertisement -

సిగరెట్ కాల్చిన తర్వాత మీకు దగ్గు వస్తుందంటే శరీరం ఆ రసాయనాలను తట్టుకోలేకపోయిందని అర్థం. రోజు ఒక సిగరెట్ తాగినా ఆరోగ్యానికి హానికరమే అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డైలీ ఒక సిగరెట్ తాగడం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. వాటికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: The healing power of hiking: హైకింగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

గుండె జబ్బులు:
సిగరెట్ తాగడం వల్ల గుండెకు హాని కలుగుతుంది. సిగరెట్ పొగ ధమనులు సంకోచించేలా చేస్తుంది. దీంతో గుండె నుంచి రక్త సరఫరా శరీర భాగాలకు సక్రమంగా జరగదు. అంతే కాకుండా గుండెపోటుకు ఇది దారితీస్తుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. రక్తం గడ్డ కట్టే చాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తులకు హాని:
రోజుకో సిగరెట్ తాగడం వల్ల శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా శ్వాసనాళాలను, ఊపిరితిత్తులలోని చిన్న గాలి సంచులను దెబ్బతింటాయి. ఇది క్రానిక్ బ్రోన్కైటిస్ ,అంఫిసెమా వంటి వ్యాధులకు దారితీస్తుంది. సిగరెట్ తాగడం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.

Also Read: West Nile Virus Symptoms: దోమల ద్వారా వెస్ట్ నైల్ వ్యాప్తి.. అసలు ఈ వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏంటి ?

సంతానోత్పత్తి సమస్య:
పురుషులు, స్త్రీలలో వంధ్యత్వ సమస్య పెరగడానికి స్మోకింగ్ కారణం అవుతుంది. ప్రధానంగా సిగరెట్ తాగితే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నోటి ఆరోగ్యానికి హాని:
రోజుకో సిగరెట్ తాగడం వల్ల చిగుళ్లు, దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా నోటి దుర్వాసన, దంతాల నష్టం, చిగుళ్ల వ్యాధులు కూడా వస్తాయి. స్మోకింగ్ అలాగే కొనసాగితే నోటిలో నికోటిన్ మూలాలు పేరుకుపోయి నోటి క్యాన్సర్ వస్తుంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: విపరీతంగా జుట్టు ఊడిపోతుందా ? అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

కంటి సమస్య:
ధూమపానం కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా సిగరెట్ పొగలోని విష రసాయనాలు సున్నితమైన కంటి కణజాలాన్ని దెబ్బతీసి కంటి శుక్లం పాడవడానికి కారణమవుతాయి. ఇది క్రమంగా దృష్టి క్షీణతతో పాటు అంధత్వానికి దారితీస్తుంది.

మధుమేహం:
రోజుకో సిగరెట్ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ ఇన్సులిన్ నిరోధకత ,ఒత్తిడిని ప్రేరేపిస్తుంది. గ్లూకోజ్ జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. నికోటిన్ ఇన్సులిన్ ఇన్సిటివిటీ దెబ్బతీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది. అంతే కాకుండా డయిబెటిస్ ముప్పు పెరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News