Big Stories

Raw Papaya Benefits: పచ్చిబొప్పాయితో ఊహించ‌ని ఆరోగ్య ప్రయోజనాలు..

 Health Benefits of Raw Green Papaya Uses and Important Facts: బొప్పాయి తినడం వల్ల మన శరీరానికి చాలా పోషకాలు అందుతాయని అందరికి తెలుసు. కానీ పచ్చి బొప్పాయి తినడం వలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిని తినడం వలన ఉదర సంబంధిత రోగాలు నయమవుతాయి. రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. బొప్పయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, వంటి అనేక పోషకాలు ఉండటాయి. పచ్చి బొప్పాయి తినడం వలన శరీరంలో గాయాలను త్వరగా మానిపోతాయి. చర్మ సౌందర్యానికి కూడా బొప్పాయి చాలా బాగా ఉపయోగపడతుంది. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి లోనే యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి.

- Advertisement -

వాటిలో ఉండే ప్రొపైన్ లు మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. స్థూలకాయం, అజీర్తితో బాధపడేవారు వీటిని తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. నేటి కాలంలో చాలా మంది మహిళలు పీసీఓడీ తో బాధపడపతున్నారు. పచ్చిబొప్పాయి తినడం వలన ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అలానే గుండె సంబంధిత సమస్యల నుండి దూరం చేస్తాయి. పచ్చిబొప్పాయి తినడం వల్ల విటమిన్ ఎ, సి, మన శరీరంలోని రోగనిరోధక శక్తి పెంచుతుంది. బొప్పాయి ఆకులు తినడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్ల నుండి కాపాడుతుంది.

- Advertisement -

Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు డెంగ్యూ బారిన పడినట్లే

పచ్చి బొప్పాయిలో ప్రొటియోలాటిక్ ఎంజైమ్ ఉంటుంది. వీటి నుండి అనేక మెడిసన్ తయారు చేస్తారు. కామెర్లు వంటి వ్యాధితో బాధడేవారికి దివ్యౌషధం. గర్భిణీలు పచ్చి బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే.. వాటిలో ఉండే లేటెక్స్ పాలవంటి పదార్ధం గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. అందుకే తినకూడదు అంటారు. కానీ డెలివరీ అయ్యాక తల్లికి పాలు బాగా పడాలంటే పచ్చి బొప్పాయి ఎంతో అవసరం. పచ్చి బొప్పాయిలో కెరోటినాయిడ్స్ టొమాటో, కారెట్ కంటే ఎక్కవ మొత్తంలో ఉంటాయని బ్రిటీష్ జనరల్ ఆఫ్ న్యూట్రీషన్ చేసిన అధ్యయనంలో తెలిసింది. బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఆస్తమా, ఆస్టియో ,ఆర్ధరైటిస్ డిసీజ్ లనుండి ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News