Big Stories

Health Benefits: ఓక్రా వాటర్‌ ఎప్పుడైనా తాగారా.? దేనితో తయారు చేస్తారో తెలుసా

Health Benefits: ఉదయాన్నే పరిగడుపున మంచి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది అని అంటారు. అయితే మంచి నీళ్లే కాకుండా చాలా రకాల నీటిని తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ నీరు, హనీ వాటర్, జీరా వాటర్, ఇలా చాలా రకాల నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇలాంటి రకమైన దానికి సంబంధించి నీళ్లు మరొకటి ఉన్నాయి. అదే ఓక్రా వాటర్. చాలా మందికి ఓక్రా వాటర్ అంటే తెలిసి ఉండదు. ఓక్రా వాటర్ ను బెండకాయలతో తయారుచేస్తారు. అయితే ఈ ఓక్రా వాటర్ వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయట. మరి ఓక్రా వాటర్ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

బెండకాయలను నానబెట్టిన నీటిని ఓక్రా వాటర్ అంటారు. రాత్రి వేళ బెండకాయలను ముక్కలు చేసి ఓ గ్లాసు నీటిలో వేసి దాదాపు 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టడం వల్ల ఈ ఓక్రా నీరు తయారవుతుంది. అయితే ఈ నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓక్రా వాటర్ ను అలాగే తాగలేని వారు కాస్త ఉప్పు, మిరియాల పొడిని కలుపుకుని తాగవచ్చు. ఇలా తయారు చేసిన నీటిని తాగితే బాగుంటుంది.

- Advertisement -

ఓక్రా వాటర్ లో విటమన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఏ, కే, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఓక్రా నీటిని తాగడం వల్ల కడుపులో పేగులు కదలికలు కూడా మెరుగ్గా జరుగుతాయి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు వంటివి తలెత్తకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఓక్రా వాటర్ కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. దీనివల్ల ఇన్సులిన్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడే వారికి కూడా ఓక్రా వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గించుకోవడానికి కూడా ఈ నీరు సహకరిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు, ఫ్లేవనాయిడ్స్ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News