Big Stories

Kidney Stones Causes Food: ఈ ఆహారాలు తింటున్నారా..? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ..!

Foods that Causes Kidney Stones: రోజులో తగినంత నీరు తీసుకోకపోతే మూత్రపిండాల్లో రాళ్లతో పాటు ఇతర కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగని నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో స్టోన్స్ రావనుకోవడం పొరపాటే. ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి తగినంత నీరు తాగడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అంతే కాకుండా తక్కువ మోతాదులో బయటి ఫుడ్స్ తినాలి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే చాన్స్ ఉంటుంది.

- Advertisement -

ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు:
కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారపదార్థాలను వీలైనంత వరకు తక్కువగా తినాలి. ముఖ్యంగా రూట్ వెజిటేబుల్స్ అంటే బీట్‌రూట్, బంగాళదుంప, వేరుశనగ వంటి వాటితో పాటు పాలకూర, చాక్లెట్లను ఎక్కువగా తినకూడదు.

- Advertisement -

2017లో జర్నల్ అఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఆక్సలైట్‌లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తయారయ్యే ప్రమాదం 23 శాతం పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌లు కూడా పాల్గొన్నారు. అయితే ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే పాలకూర వంటివి తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య ఎక్కువగా వస్తుందని ఈ పరిశోధనలో రుజువైంది.

Also Read: Knee Pain Relief Tips: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. అయితే ఈ ఫుడ్‌ని డైట్‌లో చేర్చుకోండి..!

ఉప్పు:
అధిక ఉప్పు వినియోగం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అంతేకాకుండా రక్తహీనత, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు పెద్దలు ఐదు గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తినకూడదు.

మాంసకృత్తులు:
ఎక్కువగా మాంసకృత్తులు ఉండే నాన్‌వెజ్ ఐటమ్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దారితీస్తాయి. కాబట్టి కిడ్నీ సమస్యలకు కారణమయ్యే జంతు ప్రోటీన్లు తక్కువగా తినడం మంచిది.

విటమిన్ సి ఫుడ్స్:
ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ శరీరంలో విటమిన్ సి పెరిగినా కూడా ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బాడీలో విటమిన్ సి స్థాయిలు పెరిగితే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి విటమిన్ సి ఫూడ్స్, పండ్లు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Also Read: ఈ సమస్యలు ఆడవారికే ఎక్కువగా వస్తాయట !

ప్రాసెస్డ్ ఫుడ్స్:
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పాటు వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఈ ఫుడ్స్‌లో కూడా కిడ్నీ స్టోన్స్ కు దారితీసే పదార్థాలు ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News