Big Stories

Pregnancy Tips: థర్డ్ ట్రైమిస్టర్‌లో ఈ సమస్యలు వస్తున్నాయా.. అయితే వీటిని పాటించండి

Pregnancy Tips: గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. వాటిలో కొన్ని కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 28 వారాలలో ప్రారంభమయ్యే మూడవ త్రైమాసికం తరచుగా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శిశువు వేగంగా పెరగడం, డెలివరీ టైం రావడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో వచ్చే రెండు సాధారణ సమస్యలు శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

1. కడుపు ఉబ్బరం

- Advertisement -

ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యంగా కడుపు ఉబ్బరం ఒకటి. శిశువు పెరుగుదల కారణంగా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. కడుపులోని ప్రేగులు ఒత్తిడికి గురికావడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం కుదరదు. ఒకవేళ తీసుకుంటే మంట, అజీర్తి, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి.

నివారణ చర్యలు

ఎక్కువ ఆహారం ఒకేసారి అస్సలు తీసుకోకూడదు.
రాత్రి వేళ తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మసాలా, కారం వంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు
పండ్లు, ఆకుకూరలు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
పాలు, డ్రైఫ్రూట్స్ వంటి ఎక్కువగా తీసుకోవాలి.

2. వాపు

గర్భధారణ సమయంలో శరీరం అదనపు ద్రవాన్ని సృష్టిస్తుంది. ఇది వాపుకు కారణమవుతుంది. ఇది సాధారణంగా పాదాలు, చీలమండలు, ముఖం మరియు చేతుల్లో కనిపిస్తుంది. వాపు సాధారణంగా తీవ్రంగా ఉండదు మరియు డెలివరీ తర్వాత తగ్గిపోతాయి.

నివారణ చర్యలు

ఈ సమయంలో తగినంత నీరు త్రాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తగినంత నీరు త్రాగడం వల్ల శరీరం అదనపు చెడు బ్యాక్టీరియా వంటిది మూత్రం రూపంలో బయటికి తొలగిపోతుంది.
ఈ సమయంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాల్సి ఉంటుంది. ఉప్పు నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది వాపును పెంచుతుంది.

పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు పాదాలను దిండు లేదా కుర్చీపై పెట్టుకుని పడుకోవాలి.
సాక్స్ ధరించడం వల్ల పాదాలు మరియు చీలమండలాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
నడక, స్విమ్మింగ్ మరియు యోగా ప్రసవానికి ముందు వ్యాయామం వంటి చర్యలు రక్త ప్రసరణను పెంచడంలో మరియు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News