Big Stories

Men Face Packs : మగవారి అందాన్ని పెంచే నేచురల్ ఫేస్ ప్యాక్స్ ఇవే..

Men Beauty Face Packs : పురుషుల చర్మ సంరక్షణ స్త్రీల చర్మానికి భిన్నంగా ఉంటుంది. స్త్రీల మాదిరిగానే పురుషులు కూడా తమ చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పురుషుల చర్మసౌందర్య ఉత్పత్తులను చాలా తక్కువ. ఎక్కువగా మహిళల చర్మాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసినవే. మహిళలతో పోల్చితే పురుషుల చర్మం కొంత దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న వాతావరణం కారణంగా పురుషుల చర్మం కూడా మృతకణాల సమస్యను ఎదుర్కొంటుంది. పురుషుల్లో దెబ్బతిన్న చర్మాన్ని ఇంటి చిట్కాలతో కాపాడుకోవచ్చు. ఇంట్లో సహజంగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్‌లతో చర్మాన్ని కాపాడుకోవచ్చు.

- Advertisement -

పాలతో ఫేస్ ప్యాక్

- Advertisement -

పాలలో అనేక సహజ గుణాలు ఉన్నాయి. పాలు చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. చర్మం మెరిసేందుకు సహాయపడతాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, ఎక్కువ కాలం హైడ్రేషన్‌లో ఉంచుతుంది. ఈ ప్యాక్ తయారీకి ఒక కాటన్ వస్ర్తాన్ని తీసుకొని పచ్చి పాలలో కొంతసేపు నానబెట్టాలి. ఆ తర్వాత పాలలో ముంచి వస్త్రాన్ని ముఖంపై కాసేపు ఉండనివ్వాలి. 10 నిమిషాల తర్వాత, వస్ర్తాన్ని తీసివేసి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇది చర్మానికి పోషణను అందించడంతో పాటు మెరిసేలా చేస్తుంది.

బొప్పాయి ఫేస్ ప్యాక్

ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి చర్మం లోపలి నుండి శుద్ధి చేస్తుంది. ఈ ప్యాక్ తయారీకి బొప్పాయి గుజ్జు చెంచా నిమ్మరసం, చెంచా తేనె అవసరం. ఈ ప్యాక్‌ను ముఖంపై మృదువుగా మర్దన చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. దీంతో డెడ్ స్కిన్ తొలగిపోవడంతో పాటు చర్మం నిగారిస్తుంది.

Also Read : రోజుకో సిగరెట్.. మీ ప్రాణానికి ముప్పు అని తెలుసా..?

అరటి ప్యాక్

అరటిపండుతో తయారుచేసిన ప్యాక్ తో చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించుకోవచ్చు. దీని కోసం, అరటిపండు గుజ్జు లో తేనె, రోజ్ వాటర్ కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చాలా సున్నితంగా మసాజ్ చేయాలి. దీని వల్ల చర్మం మెరిసిపోవడంతో పాటు చర్మంలోని మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. అంతే కాదు ఈ ప్యాక్‌తో ముఖంపై పేరుకుపోయిన మురికి కూడా తొలిగిపోయి కాంతివంతంగా మారుతుంది.

ద్రాక్ష ప్యాక్

ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో చర్మ సంరక్షణలో కూడా అంతే ఉపయుక్తమైనది. ఈ ప్యాక్ చేయడానికి, 10 నుంచి 12 ద్రాక్ష పండ్లు తీసుకొని వాటిని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, కొంత సేపయ్యాక కడుక్కోవాలి. ఈ ప్యాక్‌తో ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

ముల్తానీ మట్టి

పురుషుల చర్మ సంరక్షణకు ముల్తానీ మట్టిని ఉపయోగించవచ్చు. ఎక్కువగా దీనిని స్త్రీలు దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే పురుషులు కూడా దీనిని ఉపయోగించి చర్మ వర్చస్సును పెంచుకోవచ్చు. దీని కోసం ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, గంధంతో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం నిగనిగలాడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News