Big Stories

Cholesterol Control Foods: గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే !

Cholesterol Control Foods: గుండెపోటు ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. కొలెస్ట్రాల్ గుండె పోటుకు కారణమవుతుంది. సహజంగా రక్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కానీ కొలెస్ట్రాల్ పెరిగితే అది గుండెజబ్బులకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనుల్లో రక్తప్రవాహం నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఇది గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.

- Advertisement -

కొలెస్ట్రాల్ సమస్య పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన ఆహారం తీసుకోకపోవడం. రెండవది అనారోగ్యకరమైన జీవనశైలి. సహజంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడే అనేక రకాల ఆహారాలున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలను తినడం తగ్గించాలి. శరీరంలోని కొవ్వు తగ్గించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు పాల ఉత్పత్తులు, మాంసం, బాగా వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాంటి వారు శరీరంలో కొవ్వును సహజంగా తగ్గించే ఆహారాలు తీసుకోవడం మంచిది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

తృణ ధాన్యాలు:
తృణ ధాన్యాల్లో ఫైబర్‌తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. శుద్ధి చేసిన ధాన్యాల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, గుండెకు ప్రమాదకరం.
తక్కువ కొవ్వు, ప్రోటీన్:
చర్మం లేని చికెన్, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగదు. ఉదాహరణకు కొన్ని చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ అని పిలవబడే రక్తంలోని కొవ్వులను తగ్గించడంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉపయోగపడతాయి. వాల్ నట్స్, సోయా బీన్స్ వీటికి ఉదాహరణలు. గుడ్లు, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కు మంచి మూలాలు. ఇటీవలి పరిశోధనలో గుడ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయవని తేలింది.
కూరగాయలు:
కూరగాయలు, పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొన్ని రకాల ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఫైబర్ జీర్ణాశయం నుంచి కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది. బీన్స్, బఠానీలు, ధాన్యాలు చిక్కుళ్లు వంటివి ఈ రకమైన ఫైబర్ ను అధికంగా కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి. చిలగడదుంప, వంకాయ, బ్రోకలీ, యాపిల్స్, స్ట్రాబెరీ,కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడతాయి.
నట్స్:
నట్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియంలు వీటిలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్ శరీరంలో పెరగకుండా సహాయపడతాయి.
ఓట్స్ ,బార్లీ:
బీటా గ్లూకాన్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ ఓట్స్ ,బార్లీలలో ఉంటాయి. ప్రతి రోజు మూడు గ్రాముల బీటా గ్లూకాన్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. బీటా గ్లూకాన్ తిన్నప్పుడు ఇది కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

Also Read: పచ్చిబొప్పాయితో ఊహించ‌ని ఆరోగ్య ప్రయోజనాలు..

ఆరోగ్యకరమైన నూనెలు:
ఆలివ్ ఆయిల్, ఆవాల నూనె అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటాయి. ఈ నూనెల వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొబ్బరి నూనె, పామాయిలు వాడటం తగ్గించాలి. ఇతర నూనెల లాగా కాకుండా అసంతృప్త కొవ్వులు వీటిలో అధికంగా ఉంటాయి. వెన్న, చీజ్, సంతృప్త శుద్ధి చేసిన నూనెలను తీసుకోవడం మంచిది. చేపలు, అవిసె గింజలు, ఒమేగా త్రీ కొవ్వులను అధికంగా తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News