Big Stories

Apple Peel: అయ్యయ్యో.. మీరు యాపిల్ పండు తొక్క తీసి తింటున్నారా.. ?

Apple Peel: యాపిల్ పండుతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రతీ రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల శరీరంలో ఉండే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే చాలా మంది యాపిల్ పండును తినడానికి ఇష్టపడినా కూడా దానిని తొక్క తీసి తినే అలవాటు ఉంటుంది. ఇలా యాపిల్ పండును తినడం సరికాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే యాపిల్ పండులో కంటే తొక్కలోనే అనేక పోషకాలు ఉంటాయని అంటున్నారు. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే యాపిల్ తొక్కతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందువల్ల యాపిల్ పండును తొక్కతో పాటు కలిపి తినడం మంచిది. అయితే అసలు యాపిల్ లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఫైబర్:

- Advertisement -

యాపిల్ తొక్కను తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే యాపిల్ తొక్కలో ఉంటే పీచు వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు కాలేయ ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు ఇది రక్షిస్తుంది. ముఖ్యంగా ఫైబర్ వల్ల మధుమేహం వ్యాధితో బాధపడే వారికి ఆకలిని నియంత్రిస్తుంది.

ఊపిరితిత్తులకు రక్షణ:

యాపిల్ తొక్కలో ఉండే క్వెర్సెటిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తొక్కతో పాటు యాపిల్ పండును తినడద వల్ల ఊపిరితిత్తులను, గుండెకు సంబంధించిన వ్యాధులను తొలగిస్తుంది.

గుండె ఆరోగ్యానికి:

యాపిల్ తొక్కలో ఉండే పాలీఫెనాల్ రక్తపోటును అధిక నుండి తక్కువకు తగ్గిస్తుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించేందుకు తోడ్పడుతుంది. దీని వల్ల గుండె సిరలు మృదువుగా ఉంటాయి.

బరువు తగ్గడానికి :

యాపిల్ తొక్కను తినడం వల్ల ఆకలిని చాలా సేపటి వరకు నిలిపివేస్తుంది. యాపిల్ తినడం వల్ల కడుపు ఎప్పుడు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి యాపిల్ పండు సహాయపడుతుంది. అందువల్ల యాపిల్ పండును తొక్కతో తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

విటమిన్లు:

యాపిల్ తొక్కలో ఉంటే విటమిన్ ఎ, సి,కె, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News