Big Stories

Health Tips: ప్రతీ రోజూ వాల్​నట్స్​ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

Health Tips: మారుతున్న జీవనశైలితో పాటు ఆరోగ్యానికి సంబంధించి చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, నిద్ర వంటి వాటి పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది చాలా రకాల సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొంతమంది మాత్రం తరచూ తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు.

- Advertisement -

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం, డ్రై ఫ్రూట్స్ తినడం, పండ్లు, ఆకుకూరలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి చేస్తుండడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. అయితే ముఖ్యంగా తరచూ తీసుకునే డ్రై ప్రూట్స్ లలో కొన్నిటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

- Advertisement -

అంజీరా, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి వాటిని తరచూ తీసుకోవడం వల్ల మంచి ఖనిజాలు, పోషకాలు, విటమిన్స్ శరీరానికి అందుతాయి. ముఖ్యంగా వాల్ నట్స్ తినడం వల్ల కాల్షియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల జీవశక్తిని పెంచుతాయి. ఇందులోని విటమిన్ బీ7, ఈ వంటివి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు తెల్లరంగు నుంచి నల్లగా మారడానికి తోడ్పడుతుంది.

వీటిని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తినడం వల్ల నిద్రలో కూడా మార్పు వస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి వాల్ నట్స్ మంచి ఔషధంలా పనిచేస్తుంది. వాల్ నట్స్ తరచూ తినడం వల్ల మంచి నిద్రను పొందే అవకాశాలు ఉంటాయి. మరోవైపు వాల్ నట్స్ లో ఉండే మెగ్నీషియం, కాల్షియం వంటివి ఎముకలను ధృడంగా ఉంచడంలోను సహాయపడతాయి. వాల్ నట్స్ ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంపొందించేందుకు తోడ్పడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News