Big Stories

Medicines Stop Affecting The Body: మందులు శరీరాన్ని ప్రభావితం చేస్తాయా? లేదా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

Medicines Stop Affecting The Body: జీవితంలో తరచూ ఏర్పడే అనారోగ్య సమస్యలకు మందులే ఉపశమనం కలిగిస్తుంటాయి. కొంతమంది చికిత్సకు సహకరించకపోయినా కూడా కేవలం మందులు వాడి వారి రోగాలను నయం చేసుకోవాలని చూస్తుంటారు. అయితే మందులు అన్ని రకాల వ్యాధులకు పని చేయవని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల వ్యాధులకు మందులు సహకిరించినా కూడా మరికొన్ని రకాలు అంటే దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం మందులు అసలు ప్రభావితం చేయబోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్, అలెర్జీ వంటి కొన్ని సమస్యలు కూడా పదే పదే మందులను డిమాండ్ చేస్తాయి. కానీ చాలాసార్లు ఈ మందులు పనికిరానివిగా నిరూపించబడ్డాయి. దీనికి కారణం మారుతున్న జీవనశైలి, తప్పుడు అలవాట్లే కారణం అని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

1. చాలా సార్లు మందులను తీసుకునే క్రమంలో తప్పుడు మోతాదులో తీసుకుంటారు. అది అంతగా ప్రభావవంతంగా ఉండదు.
2. కొందరు మందులు తీసుకున్నా కూడా అవి వారి శరీరానికి అస్సలు పనిచేయవు.
3. మందుల ప్రభావంతో పాటు తరచూ తీసుకునే ఆహారం వల్లే ఏర్పడిన సమస్యలు తగ్గిపోతాయి.
4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే మందులు పనిచేయవు. జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తింటే, మందుల ప్రభావం తగ్గుతుంది. వైద్యులు సూచించే మందులతో రియాక్ట్ అయ్యే రసాయనాలు వీటిలో ఉండటమే దీనికి కారణం.
5. ఎక్కువ మసాలాలు, నూనెతో కూడిన ఆహారాన్ని ఇష్టపడితే, అది మందులను తటస్థీకరిస్తుంది.
6. కొందరికి ఇప్పటికే తరచూ మందులు వేసుకునే అలవాటు ఉంది. ఈ మందుల ప్రభావం సరిగా కనిపించదు.
7. ఇతర వ్యాధులు, అధిక మద్యపానం లేదా ధూమపానం వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News