Big Stories

Pillow: మొటిమలు రావడానికి మీరు వాడే దిండు కూడా కారణమని మీకు తెలుసా ?

Pillowcases and Acne: పడుకునేటప్పుడు చాలామంది తల కింద దిండు పెట్టుకుంటారు. తల కింద దిండు లేనిదే చాలామందికి నిద్రపట్టదు. మెత్తటి పిల్లోతో హాయిగా నిద్ర పోతారు. కానీ ఆ దిండుతోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మీలో ఎంత మందికి తెలుసు? అందాన్ని దెబ్బతీసే మొటిమలతో సహా, శ్వాసకోశ వ్యాధులకు దిండ్లు కారణమవుతాయని మీకు తెలుసా? ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

అలర్జీ:
మనలో చాలామంది రోజంతా బయట తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయకుండానే బెడ్‌పై వాలిపోతుంటారు. దీని వల్ల దుస్తులపై ఉన్న బ్యాక్టీరియా దుమ్ము, ధూళి కణాలు బెడ్ షీట్లు, తలగడలపై చేరతాయి. తర్వాత మనం పడుకున్నప్పుడు అవి మన శరీరంలోకి చేరి అలర్జీలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పడుకోవాలని సూచిస్తున్నారు.
మొటిమలు:
తలకింద తలగడ పెట్టుకున్నప్పుడు ముఖంపై ఉన్న దుమ్ము, ధూళి, నూనె, జుట్టు వంటివి దిండుకు అంటుకుంటాయి. దీని వల్ల దిండుపై బ్యాక్టీరియా కూడా పెరిగిపోతుంది. తిరిగి ఇవి ముఖంపైకి చేరతాయి. ఈ కారణంగానే ముఖంపై మొటిమలు కూడా పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

2016లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ, జర్నల్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం దిండులోని బ్యాక్టీరియా మొటిమల తీవ్రతను కూడా పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది. జపాన్‌లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీలో చర్మవ్యాధి నిపుణులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. దిండు అపరిశుభ్రంగా ఉండడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది.

Also Read: మీరు వాడే టూత్ పేస్ట్ ఇలాంటిదేనా.. అయితే నోటి క్యాన్సర్ బారిన పడినట్లే

ఇవి చేయండి:

  • బెడ్‌షీట్, దిండుపై ఉన్న బ్యాక్టీరియా తొలగిపోవాలంటే ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేసుకోవాలి. రోజు ఉతకడం వీలుకాదు కాబట్టి ఎండలో ఆరవేయాలి.
  • వారానికి కనీసం ఒకసారైనా వేడి నీళ్లలో వేసి దిండు కవర్లను శుభ్రం చేయాలి.
  • ఆరు నెలలకొకసారి కొత్త దిండు కవర్‌ను మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • తలగడ సరిగా లేకపోతే మెడ కండరాలపై కూడా ఒత్తిడి ఏర్పడి నొప్పికి దారితీస్తుంది.
  • అనుకూలంగా ఉండే దిండులను ఎంపిక చేసుకోవాలి.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News